Hemoglobin : రక్తహీనతతో బాధపడుతున్నారా..? హీమోగ్లోబిన్ పెంచే అద్భుతమైన జ్యూస్ ఇదిగో..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేయడంలో హీమోగ్లోబిన్ పాత్ర ఎంతో కీలకం. రక్తపరీక్షలో మీ హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని తేలితే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. ఐరన్ (iron) లోపాన్ని జయించి, రక్తం వృద్ధి చెందడానికి మీ రోజువారీ డైట్‌లో ఓ ప్రత్యేకమైన జ్యూస్‌ను చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది.

బీట్‌రూట్ జ్యూస్ ఎందుకు ప్రత్యేకం అంటే..?

హీమోగ్లోబిన్ పెంచడంలో బీట్‌రూట్ జ్యూస్ చక్కగా సహాయ పడుతుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్స్, ఫోలేట్‌తో పాటు తగినంత ఐరన్ ఉంటుంది. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అయితే, కేవలం ఈ జ్యూస్ ఒక్కటే తాగితే రక్తం అమాంతం పెరిగిపోతుందని భావించకూడదు. దీనితో పాటు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

ఇది కూడాచదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

ఎలా తయారు చేయాలి..?

తాజా బీట్‌రూట్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి, పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని బ్లెండర్ లేదా మిక్సీలో వేసి, తగినంత నీరు పోసి జ్యూస్ చేసుకోవాలి.

ముఖ్య గమనిక.. ఇందులో పంచదార అస్సలు కలపకూడదు. దానికి బదులుగా కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. నిమ్మకాయలోని విటమిన్-సి.. బీట్‌రూట్ ద్వారా అందే ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహించేలా చేస్తుంది.

కేవలం జ్యూస్‌పైనే ఆధారపడొద్దు..!

హీమోగ్లోబిన్ స్థాయిలు వేగంగా పెరగాలంటే జ్యూస్‌తో పాటు మీ డైట్‌లో ఈ మార్పులు చేసుకోండి..

ఐరన్ ఫుడ్స్..పాలకూర, శనగలు, రాజ్‌మా, బీన్స్, ఆకుకూరలు, నువ్వులు వంటివి రోజూవారీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.

విటమిన్-సి..ఐరన్ ఒంటపట్టాలంటే ఉసిరి, జామ, నారింజ వంటి విటమిన్-సి అధికంగా ఉండే పండ్లను తప్పనిసరిగా తీసుకోండి.

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది.

టీ, కాఫీలతో జాగ్రత్త..!

రక్తహీనత ఉన్నవారు భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్ ఫుడ్ తీసుకున్న వెంటనే టీ, కాఫీలు తాగకూడదు. వీటిలో ఉండే కొన్ని మూలకాలు శరీరం ఐరన్‌ను గ్రహించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి, భోజనానికి, టీ,కాఫీకి మధ్య కనీసం గంట వ్యవధి ఉండేలా చూసుకోండి.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?

ఎప్పుడూ విపరీతమైన అలసట, నీరసం, తలతిరగడం, కొద్దిగా నడిచినా లేదా చిన్న పని చేసినా ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సీబీపీ (Complete Blood Picture) పరీక్ష చేయించుకోండి. హీమోగ్లోబిన్ మరీ తక్కువగా ఉంటే, డాక్టర్ సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లు లేదా మందులు వాడాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.