Burning and Itching : గోరింటాకుతో చేతులకు అలర్జీ వస్తోందా..? మంట, దురద తగ్గాలంటే ఇలా చేయండి..
సాక్షి లైఫ్ : పండుగలు, శుభకార్యాల సమయంలో మహిళలు చేతులకు అందంగా మెహందీ పెట్టుకోవడం ఆనవాయితీ. అయితే, కొన్నిసార్లు ఇది పెట్టుకున్న తర్వాత చేతుల్లో మంట, దురద, వాపు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. వీటిని సాధారణ విషయంగా కొట్టిపారేయకూడదు. ముఖ్యం రసాయనాలతో కూడిన మెహందీ కోన్ల వల్ల చర్మం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలు ఈ అలర్జీ ఎందుకు వస్తుంది..? ఉపశమనం పొందే మార్గాలు ఏంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
అలర్జీకి ప్రధాన కారణాలు..?
సహజసిద్ధమైన ఆకులతో రుబ్బిన గోరింటా కుతో ఎలాంటి హాని ఉండదు. కానీ, రంగు కోసం మార్కెట్లో దొరికే 'బ్లాక్ హెన్నా' (Black Henna)లో పారాఫెనిలెనెడియమైన్ (PPD) అనే రసాయనాన్ని కలుపుతారు. దీనివల్లే చర్మంపై దద్దుర్లు, వాపు, తీవ్రమైన దురద వస్తాయి. సున్నితమైన చర్మం..చర్మం సున్నితంగా (sensitive skin) ఉన్నవారికి లేదా ఎగ్జిమా లాంటి చర్మ సమస్యలు ఉన్నవారికి ఈ రసాయనాల వల్ల అలర్జీలు త్వరగా వస్తాయి. ఎక్కువసేపు ఉంచుకోవడం.. గోరింటాకు పెట్టుకున్న తర్వాత మంటగా అనిపించినా రంగు కోసం ఎక్కువసేపు అలాగే ఉంచుకుంటే చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఉపశమనానికి సులభమైన మార్గాలు..
వెంటనే కడిగేయండి..చేతులపై మంట లేదా దురద మొదలైన వెంటనే గోరువెచ్చని లేదా సాధారణ నీటితో నెమ్మదిగా కడిగేయాలి. మచ్చలు పోవాలని గట్టిగా రుద్దకూడదు. చల్లటి కాపడం..ఒక శుభ్రమైన వస్త్రాన్ని చల్లటి నీటిలో ముంచి, అలర్జీ ఉన్న చోట 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచితే ఉపశమనం లభిస్తుంది. గోకడం వద్దు..దురదగా ఉందని గోకడం వల్ల ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు వ్యాపించి, చర్మం మరింత దెబ్బతింటుంది.
సుగంధ ద్రవ్యాలకు దూరం..అలర్జీ ఉన్నచోట సబ్బులు, పర్ఫ్యూమ్స్, బాడీ స్క్రబ్స్, క్రీమ్స్ వంటివి వాడకూడదు. మంటగా ఉందని నిమ్మరసం, బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ వంటివి రాస్తే చర్మం మరింతగా కందిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?
చర్మంపై నీటి బొబ్బలు రావడం, భరించలేని నొప్పి, వాపు పెరగడం లేదా ఎరుపుదనం చేతులంతా వ్యాపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే చర్మవ్యాధి నిపుణులను (Dermatologist) సంప్రదించి, వారు సూచించిన లేపనాలు (Ointments) లేదా మందులు వాడటం సురక్షితం.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
