Isabgol for Diabetes : మధుమేహుల డైట్‌లో 'ఇసబ్‌గోల్'.. రక్తంలో చక్కెరను నిజంగానే అదుపు చేస్తుందా..?
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes) బారిన పడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరినీ ఈ సమస్య వేధిస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పితే కళ్లు, కిడ్నీలు, నరాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే, మధుమేహాన్ని నియంత్రించడంలో ఫైబర్ (fiber) అధికంగా ఉండే 'ఇసబ్‌గోల్' (Psyllium husk) అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఇందులో నిజమెంత..? ఇది డయాబెటిక్ పేషెంట్లకు ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇసబ్‌గోల్ అంటే ఏమిటి..?
'ప్లాంటాగో ఓవాటా' (Plantago ovata) అనే మొక్క గింజల పైపొరనే ఇసబ్‌గోల్ లేదా సైలియం అని పిలుస్తారు. ఇందులో నీటిలో కరిగే పీచుపదార్థం (Soluble fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది నీటితో కలిసినప్పుడు ఉబ్బి, ఒక చిక్కటి జెల్ లాగా మారుతుంది. ఈ సహజ లక్షణమే మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.
చక్కెర స్థాయిల నియంత్రణలో ఇది ఎలా పనిచేస్తుంది..?
గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది.. మనం ఆహారం తీసుకున్న తర్వాత, అది కడుపులో జీర్ణమయ్యే ప్రక్రియను ఇసబ్‌గోల్ జెల్ నెమ్మదిస్తుంది. దీనివల్ల పిండిపదార్థాలు (carbohydrates) విచ్ఛిన్నమై గ్లూకోజ్‌గా మారే ప్రక్రియ ఆలస్యమవుతుంది.
షుగర్ స్పైక్స్‌కు చెక్..
భోజనం చేసిన వెంటనే అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడాన్ని ఇది అడ్డుకుంటుంది. గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలో కలవడం వల్ల షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి.
ఇన్సులిన్ పనితీరు..
కరిగే పీచుపదార్థం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..
కేవలం మధుమేహానికే కాకుండా ఇసబ్‌గోల్ వల్ల ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. మలబద్ధకం సమస్య నుంచి వేగంగా ఉపశమనం కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కడుపు నిండిన భావన కలిగించి, అతిగా తినకుండా అడ్డుకుంటుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నిపుణుల హెచ్చరికలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇసబ్‌గోల్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయ పడినప్పటికీ, ఇది మధుమేహానికి మందు లేదా శాశ్వత పరిష్కారం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నీరు ముఖ్యం.. ఇసబ్‌గోల్ తీసుకునేటప్పుడు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. తగినంత నీరు తాగకపోతే ఉక్కిరిబిక్కిరి అవ్వడం లేదా జీర్ణాశయంలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
సమతుల్యతే కీలకం..సరైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, వైద్యులు సూచించిన మందులతో పాటే దీనిని సప్లిమెంట్‌గా వాడాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ రూపంలోనైనా సైలియం, ఇసబ్‌గోల్ తీసుకోవడం ప్రారంభించే ముందు కచ్చితంగా తమ వైద్యుడిని సంప్రదించి, వారి సూచన మేరకే మోతాదును నిర్ణయించుకోవాలి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
