Triglycerides : రక్తంలో కొవ్వు చేరుతోందా..? సైలెంట్ కిల్లర్ 'ట్రైగ్లిజరైడ్స్'తో జాగ్రత్త..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్, బీపీ అదుపులో ఉండాలని మనందరికీ తెలుసు. కానీ, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్న ప్పుడు మనం తరచుగా నిర్లక్ష్యం చేసే మరో ముఖ్యమైన అంశం 'ట్రైగ్లిజరైడ్స్' (Triglycerides). ఇవి పెరిగితే గుండె జబ్బులు, పక్షవాతం, ఫ్యాటీ లివర్ వంటి తీవ్ర సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరీక్షలు చేయించుకోకుండానే మన రక్తంలో ఈ కొవ్వులు పెరిగాయని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

 

అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి..?

మనం తీసుకునే ఆహారంలో ఖర్చు కాగా మిగిలిపోయిన అదనపు కేలరీలను శరీరం ట్రైగ్లిజరైడ్స్ అంటే ఒక రకమైన కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు ఈ కొవ్వును కరిగించి శక్తిగా వాడుకుంటుంది. ఇవి మన శరీరానికి అవసరమే అయినప్పటికీ.. మోతాదు మించితే మాత్రం ప్రాణాంతకంగా మారుతాయి.

ఎందుకు పెరుగుతాయి..? ఎవరికి ఎక్కువ ముప్పు అంటే..?

గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం, జంక్ ఫుడ్, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటి అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల ఇవి సైలెంట్‌గా పెరిగిపోతాయి. ముఖ్యంగా అధిక బరువు, టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు, ధూమపానం చేసేవారికి, వ్యాయామం చేయని వారికి ఈ ముప్పు చాలా ఎక్కువ.

ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!

సాధారణంగా ట్రైగ్లిజరైడ్స్ పెరిగినప్పుడు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. కానీ, పరిస్థితి తీవ్రమవుతున్న కొద్దీ శరీరం ఈ క్రింది సంకేతాలను ఇస్తుంది.

ప్యాంక్రియాటైటిస్ ముప్పు..

ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు 500 mg/dL కంటే ఎక్కువ దాటితే క్లోమగ్రంథి వాపు (Pancreatitis) వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల కడుపు పైభాగంలో హఠాత్తుగా తీవ్రమైన నొప్పి వచ్చి, అది వీపు వైపునకు వ్యాపిస్తుంది. దీనికి తోడు వాంతులు, వికారం, జ్వరం, ఆకలి మందగించడం వంటివి కనిపిస్తాయి.

గుండెలో అసౌకర్యం, ఆయాసం..

రక్తనాళాల్లో ఈ కొవ్వు విపరీతంగా పేరుకుపోవడం వల్ల నరాలు సన్నబడి, గుండెకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా ఛాతీలో నొప్పి, కొద్దిగా నడిచినా లేదా మెట్లు ఎక్కినా విపరీతమైన ఆయాసం, నీరసం వస్తాయి.

చర్మంపై మార్పులు..

రక్తంలో ఈ కొవ్వులు విపరీతంగా పెరిగినప్పుడు, చర్మం కింద నిల్వ అవ్వడం మొదలవుతుంది. దీనివల్ల మోచేతులు, మోకాలు, చేతులు, పాదాలు లేదా వీపుపై పసుపు లేదా నారింజ రంగులో చిన్న చిన్న బొబ్బలు లేదా గడ్డలు ఏర్పడతాయి.

ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, రోజూ కనీసం అరగంట వ్యాయామం, సమతుల్య ఆహారం ద్వారా ట్రైగ్లిజరైడ్లను అదుపులో ఉంచుకో వచ్చు. అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి రక్తపరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.