Natural Remedies for Healthy hair : కేశాల సహజ పోషణకు సింపుల్ రెమిడీస్ మీకోసమే.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య 'జుట్టు రాలడం'. నలుగురు కలిస్తే చాలు.. కేశాల గురించే చర్చ. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలు, రసాయనాలతో కూడిన ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటారు. వీటికి బదులుగా ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే గుమ్మడి గింజలతో నూనె తయారుచేసుకుంటే, కేశాలకు అద్భుతమైన పోషణ అందుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి, మాడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఆ నూనెను ఎలా తయారు చేయాలో చూద్దాం..!

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

కావాల్సిన పదార్థాలు.. 

ఎండిన గుమ్మడి గింజలు: ఒక కప్పు,

కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె: ఒక కప్పు,

మిక్సీ, వడకట్టడానికి పలుచటి కాటన్ వస్త్రం లేదా జల్లెడ, ఒక గాజు సీసా.

తయారీ విధానం ఇలా..

 ముందుగా గుమ్మడి గింజలను నీటితో శుభ్రంగా కడిగి, తడిలేకుండా కాసేపు ఆరబెట్టాలి. ఆరిన గింజలను మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకోవాలి. మరీ మెత్తటి పొడిలా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి, అందులో కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె పోసి వేడి చేయాలి.

నూనె కాస్త వేడెక్కాక, ముందుగా గ్రైండ్ చేసుకున్న గుమ్మడి గింజల మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. సన్నని మంటపై 15 నుంచి 20 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడికించాలి. నూనె రంగు మారి, గుమ్మడి గింజల సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత పలుచటి వస్త్రం లేదా జల్లెడ సహాయంతో వడకట్టి, పొడిగా ఉన్న గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

అంతే.. రసాయనాలు లేని, కేశాలకు ప్రాణం పోసే 'గుమ్మడి గింజల నూనె' సిద్ధం!

ఈ నూనెతో కలిగే ప్రయోజనాలివే..

కుదుళ్లకు బలం.. గుమ్మడి గింజలలో జింక్, మెగ్నీషియం, విటమిన్-ఇ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కేశాల కుదుళ్లను బలోపేతం చేసి జుట్టుకు తగిన పోషణను అందిస్తాయి.

జుట్టు రాలడానికి చెక్..అధికంగా జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి ఈ నూనె దివ్యౌషధంలా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు విరిగిపోవడం, రాలడం తగ్గుముఖం పడుతుంది. మాడుకు తేమ.. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు మాడుకు అవసరమైన తేమను అందించి, పొడిబారకుండా కాపాడతాయి. తద్వారా చుండ్రు, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు దరిచేరవు. సహజమైన మెరుపు..నిర్జీవంగా, పొడిగా మారిన జుట్టుకు ఈ నూనెతో మర్దన చేయడం వల్ల కేశాలు మృదువుగా మారి, సహజ మెరుపును సంతరించుకుంటాయి.

వాడే విధానం..

గుమ్మడి గింజల నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేయాలి. ఆ నూనెను మాడుకు, జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 5 నుంచి 10 నిమిషాల పాటు వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. ఇలా రాసిన నూనెను కనీసం ఒకటి లేదా రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. సమయం ఉంటే రాత్రంతా ఉంచుకున్నా మంచిదే. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. మెరుగైన ఫలితాల కోసం వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ నూనెను వాడితే సరిపోతుంది.

 

ఇది కూడా చదవండి..Longevity habits : జపాన్‌లోని ఒకినావా ప్రాంత ప్రజల సుదీర్ఘ ఆయుష్షు వెనుక ఉన్న ప్రధాన రహస్యం ఇదే..

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.