Longevity habits : జపాన్‌లోని ఒకినావా ప్రాంత ప్రజల సుదీర్ఘ ఆయుష్షు వెనుక ఉన్న ప్రధాన రహస్యం ఇదే..
సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలిలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల డైట్ ప్లాన్స్ ఫాలో అవుతుంటారు. అయితే, జపాన్‌కు చెందిన 'హారా హాచీ బూ' (Hara Hachi Bu) అనే పురాతన ఆహారపు అలవాటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా జపాన్‌లోని ఒకినావా ప్రాంత ప్రజల సుదీర్ఘ ఆయుష్షు వెనుక ఉన్న ప్రధాన రహస్యం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం తక్కువ తినడం కాదు, తీసుకునే ఆహారం పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో ఉండే పద్ధతి. ఈ జపనీస్ డైట్ టెక్నిక్ గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
హారా హాచీ బూ అంటే ఏమిటి..?
జపనీస్ సంప్రదాయం ప్రకారం కడుపు 80 శాతం నిండే వరకే భోజనం చేయడాన్ని 'హారా హాచీ బూ' అంటారు. అంటే, కడుపులో ఇంకా కొంచెం ఖాళీ ఉందనగానే తినడం ఆపేయాలి. పొట్టను పూర్తిగా 100 శాతం ఆహారంతో నింపకూడదు. దీని ఉద్దేశం పస్తులుండటం లేదా ఆకలితో మాడిపోవడం కాదు, అవసరానికి మించి అతిగా తినే (Overeating) అలవాటును అరికట్టడం.
ఇది ఎలా పనిచేస్తుంది..?
సాధారణంగా మనం వేగంగా భోజనం చేసినప్పుడు, కడుపు నిండిన విషయాన్ని మెదడు గ్రహించడానికి సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో మనం మరింత ఎక్కువగా తినేస్తుంటాం. కానీ 'హారా హాచీ బూ' పద్ధతిలో నిదానంగా, ఆస్వాదిస్తూ తినడం వల్ల కడుపు నిండిన సంకేతాలు మెదడుకు సరైన సమయంలో అందుతాయి. దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంతే అందుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ చిన్న ఆహారపు అలవాటును దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి.బరువు నియంత్రణ..శరీరానికి అవసరమైన మేరకే తినడం వల్ల అదనపు కేలరీలు కొవ్వుగా మారవు. ఫలితంగా ఊబకాయం దరిచేరదు, బరువు అదుపులో ఉంటుంది.మెరుగైన జీర్ణవ్యవస్థ..కడుపును అతిగా నింపకపోవడం వల్ల జీర్ణశయావయవాలపై ఒత్తిడి తగ్గుతుంది. తీసుకున్న ఆహారం సాఫీగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు. చెడు అలవాట్లకు చెక్.. ఆకలిని, తినే మోతాదును అర్థం చేసుకోవడం వల్ల పదే పదే చిరుతిళ్లు (snacks) తినే అలవాటు తగ్గుతుంది. ఇది ఒక కఠినమైన డైట్ ప్లాన్ లా కాకుండా, ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిగా మారడం వల్ల దీర్ఘకాలంలో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు.
ఈ పద్ధతిని ఎలా ఆచరించాలి..?
ఈ జపనీస్ టెక్నిక్‌ను మనం కూడా చాలా సులువుగా అలవాటు చేసుకోవచ్చు. అందుకు పలు చిట్కాలు పాటించండి. ఆహారాన్ని నిదానంగా, బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. భోజనం చేసేటప్పుడు టీవీ చూడటం, మొబైల్ వాడటం మానుకోవాలి. ధ్యాస మొత్తం భోజనం పైనే ఉండాలి. మీరు తినే ప్లేట్ సైజును మార్చండి. పెద్ద ప్లేట్లకు బదులుగా చిన్న ప్లేట్లలో తినే అలవాటు చేసుకోండి. దీనివల్ల తక్కువ ఆహారం కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
కడుపు పూర్తిగా బిగుతుగా అయ్యేదాకా కాకుండా, ఇంకొన్ని ముద్దలు తినగలను అనుకున్న సమయంలోనే భోజనం ముగించాలి. కేవలం కడుపు నింపడం కోసమే కాకుండా, విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పోషక విలువలున్న సమతులాహారానికి (Balanced Diet) పెద్దపీట వేయాలి.
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
