smoking ban new Rules : పబ్లిక్ ప్లేస్‌లో స్మోకింగ్ చేస్తే జరిమానాలు తప్పవు.. కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులను సేవించడం చట్టరీత్యా నేరం. ఇది ధూమపానం చేసే వారికే కాకుండా, చుట్టుపక్కల ఉండే అమాయకుల ఆరోగ్యానికి పరోక్ష ధూమపానం ద్వారా కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తోంది.

చట్టం ఏం చెబుతోంది? జరిమానా ఎంత..?

భారతదేశంలో పొగాకు ఉత్పత్తుల నియంత్రణ కోసం 'కోట్పా చట్టం 2003' (COTPA 2003) అమల్లో ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడంపై పూర్తి నిషేధం ఉంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ పట్టుబడితే అక్కడికక్కడే జరిమానా విధించే అవకాశం ఉంది.

విద్యాసంస్థల సమీపంలో ధూమపానం చేసినా లేదా పదేపదే ఈ నిబంధనలను ఉల్లంఘించినా, స్థానిక సంస్థలు లేదా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..లివర్ డిటాక్స్ జ్యూస్ రెసిపీ : మీ కాలేయాన్ని న్యాచురల్ గా శుభ్రపర్చుకోండి..

ఇది కూడా చదవండి..Be alert : ఫ్యాటీ లివర్ కారణంగా ముఖంపై కనిపించే 5 సంకేతాలు ఇవే.. 

 

బహిరంగ ప్రదేశాలు అంటే ఏమిటి..?

సాధారణ ప్రజల రాకపోకలు ఉండే ప్రతి ప్రదేశాన్ని పబ్లిక్ ప్లేస్‌గానే పరిగణిస్తారు. వీటిలో ప్రధానమైనవి.

ఆసుపత్రులు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, గ్రంథాలయాలు.

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణా సాధనాలు.

సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, పాఠశాలలు, కళాశాలలు వంటి విద్యాసంస్థలు.

స్మోకింగ్ చేయడానికి ఎక్కడ అనుమతి ఉంది..?

బహిరంగ ప్రదేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ధూమపానానికి చట్టం మినహాయింపు ఇచ్చింది. 30 లేదా అంతకంటే ఎక్కువ గదులు ఉన్న హోటళ్లు, 30కి పైగా సీటింగ్ సామర్థ్యం ఉన్న రెస్టారెంట్లు, విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా 'స్మోకింగ్ జోన్'లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మాత్రమే ధూమపానానికి అనుమతి ఉంటుంది.ఈ జోన్లలో పొగ బయటకు సులభంగా వెళ్లేలా ప్రత్యేక వెంటిలేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. పబ్లిక్ ప్లేస్ యజమానులు తప్పనిసరిగా 'నో స్మోకింగ్' బోర్డులను ప్రదర్శించాలి. నిబంధనలు పాటించని యజమానులకు కూడా జరిమానా విధిస్తారు.

జరిమానాల బారిన పడకుండా ఉండాలంటే..?

బస్టాప్‌లు, ఆసుపత్రులు, పార్కులు వంటి పబ్లిక్ ప్లేస్‌లలో సిగరెట్ తాగకండి.'నో స్మోకింగ్' బోర్డులు ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను గౌరవించండి, సాటి పౌరులకు ఆదర్శంగా నిలవండి. ఒకవేళ పోలీసులు లేదా అధికారులు మీకు జరిమానా విధిస్తే, బాధ్యతాయుతమైన పౌరుడిగా నిబంధనలకు కట్టుబడి వారి నుండి తప్పనిసరిగా అధికారిక రశీదును తీసుకోండి.

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.