Hypothyroidism : థైరాయిడ్ ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేవగానే విపరీతమైన అలసట.. పని చేయాలనిపించకపోవడం.. కారణం లేకుండానే బరువు పెరగడం.. ఇవన్నీ కేవలం ఒత్తిడి లేదా నిద్రలేమి వల్లే జరుగుతున్నాయని అనుకుంటున్నారా..? అయితే మీరు పొరబడినట్లే! తరచుగా వేధించే ఈ సమస్యలు థైరాయిడ్ (Thyroid) గ్రంథి పనితీరులో లోపాలకు సంకేతాలు కావచ్చు. సాధారణ అలసటకు, థైరాయిడ్ లక్షణాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

థైరాయిడ్ అంటే ఏమిటి..?

థైరాయిడ్ అనేది మన మెడ ముందు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు చిన్న గ్రంథి. ఇది శరీర జీవక్రియలను (Metabolism), శక్తిని నియంత్రించే అత్యంత కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి తగినన్ని హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే దానిని ‘హైపోథైరాయిడిజం’ (Hypothyroidism) అని, మోతాదుకు మించి ఎక్కువగా ఉత్పత్తి చేస్తే ‘హైపర్ థైరాయిడిజం’ (Hyperthyroidism) అని అంటారు.

థైరాయిడ్ ప్రధాన లక్షణాలు..

1.అలసట, సుస్తి.. రాత్రి తగినంత నిద్రపోయినప్పటికీ ఉదయం లేవగానే తీవ్రమైన అలసట, శరీరం బరువుగా, బద్ధకంగా అనిపించడం హైపోథైరాయిడిజం ప్రధాన లక్షణం. దీనికి తోడు చలిగా అనిపించడం, మలబద్ధకం వంటివి ఉంటే కేవలం ఒత్తిడి అని కొట్టిపారేయకూడదు.

2. ఆకస్మాత్తుగా బరువులో మార్పులు..ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు లేకపోయినా.. అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం థైరాయిడ్ వల్ల కావచ్చు. హైపోథైరాయిడిజంలో శరీర జీవక్రియలు నెమ్మదిస్తాయి. దీనివల్ల క్యాలరీలు కరగడం తగ్గిపోయి, బరువు వేగంగా పెరుగుతారు.

3. చిరాకు, ఆందోళన.. నిరంతరం ఒత్తిడి, చిరాకుగా అనిపించడం కూడా థైరాయిడ్ సమస్యతో ముడిపడి ఉండొచ్చు. ముఖ్యంగా హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు చేతులు వణకడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, విపరీతమైన ఆందోళన లేదా అశాంతిగా అనిపిస్తుంది.

4. జుట్టు, చర్మ సమస్యలు.. జుట్టు విపరీతంగా రాలిపోయి పల్చబడటం, చర్మం పొడిబారడం (Dry skin) కూడా థైరాయిడ్ లోపానికి సంకేతాలు. వీటికి తోడు పైన చెప్పుకున్న నీరసం, బరువు పెరగడం వంటి లక్షణాలు జతకలిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

వైద్యుడిని ఎప్పుడు కలవాలి..?

ఈ లక్షణాలు ఒకట్రెండు రోజులు ఉండి తగ్గితే ఫర్వాలేదు కానీ, వరుసగా కొన్ని వారాల పాటు వేధిస్తూ.. మీ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ప్రమాద హెచ్చరికలు..

మెడ భాగంలో వాపు లేదా గడ్డలు రావడం

ఆహారం లేదా నీరు మింగడంలో ఇబ్బంది

శ్వాస తీసుకోవడంలో కష్టం

గుండె లయ తప్పడం (Heart palpitations)

ఈ సమస్యలు గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే థైరాయిడ్ ప్రొఫైల్ రక్త పరీక్ష చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.