Unsaturated fats : వాల్‌నట్స్‌లోని అసంతృప్త కొవ్వులు గుండెకు ఎలాంటి మేలు చేస్తాయి..?
సాక్షి లైఫ్ : డ్రైఫ్రూట్స్ జాబితాలో వాల్నట్ (walnut) కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చూసేందుకు అచ్చం మెదడు ఆకృతిలో ఉండే ఈ గింజ.. పోషకాలలోనూ రారాజే. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు వాల్నట్స్ తినడం వల్ల శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
బ్రెయిన్ ఫుడ్..
వాల్నట్ను అద్భుతమైన 'బ్రెయిన్ ఫుడ్' గా పరిగణిస్తారు. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు చురుకుగా, సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా విద్యార్థులు, మానసిక శ్రమ చేసేవారికి ఇది మంచి స్నాక్. వాల్‌నట్స్‌లోని అసంతృప్త కొవ్వులు (Unsaturated fats) గుండెకు ఎంతో మేలు చేస్తాయి. నూనెలో వేయించిన జంక్ ఫుడ్ కు బదులుగా వీటిని మితంగా తింటే గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.
బరువు నియంత్రణ, ఎముకల పటుత్వం..
వాల్నట్స్ లో ఉండే హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ కారణంగా కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. అయితే ఇందులో క్యాలరీలు ఎక్కువ కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు మితంగానే తీసుకోవాలి. దృఢమైన ఎముకలు..వాల్‌నట్స్‌లో మెగ్నీషియం, భాస్వరం (Phosphorus) వంటి అత్యవసర ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు మరియు కండరాలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
జీర్ణక్రియ మెరుగు.. ఒత్తిడి దూరం..
వాల్నట్స్ లోని పీచు పదార్థం (Fiber) జీర్ణవ్యవస్థ సాఫీగా జరిగేలా చూసి, మలబద్ధకం రాకుండా చేస్తుంది. వాల్ నట్స్ తో పాటు రోజంతా తగినన్ని నీళ్లు తాగడం కూడా ముఖ్యం. శరీర కణాలను దెబ్బతీసే ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative stress) నుంచి కాపాడటంలో ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతంగా పనిచేస్తాయి.
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
