Walk for 10 Minutes After Dinner : రాత్రి భోజనం తర్వాత ఓ పది నిమిషాలు నడవండి.. మధుమేహం, ఊబకాయానికి చెక్ పెట్టండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు భోజన సమయాలు, ఆ తర్వాత మనం పాటించే అలవాట్లపై కూడా శ్రద్ధ వహించాలి. చాలామంది రాత్రి భోజనం చేయగానే టీవీలు, మొబైల్స్ చూస్తూ కూర్చోవడం లేదా వెంటనే నిద్రపోవడం చేస్తుంటారు. కానీ, ఈ అలవాటు నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు తేలికపాటి నడక (Light walking) సాగించడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

భోజనం తర్వాత నడక ఎందుకు అవసరం..?

మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి, అందులోని పోషకాలను శరీరం గ్రహించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మన శరీరం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. భోజనం తర్వాత శరీరం ఎలాంటి కదలిక లేకుండా ఉంటే.. జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఫలితంగా గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే తిన్న తర్వాత కాసేపు నడిస్తే, శరీరంలోని కండరాలు ఉత్తేజితమై, గ్లూకోజ్ వినియోగం పెరిగి జీర్ణవ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది.

నడకతో కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే..

మధుమేహానికి చెక్..

భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఆ సమయంలో కాసేపు నడిస్తే, కండరాలు ఆ గ్లూకోజ్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించు కుంటాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్-2 మధుమేహం, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి ఈ అలవాటు ఎంతో మేలు చేస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ..

రాత్రి పూట నడవడం వల్ల పొట్ట, పేగుల సహజ కదలికలు మెరుగుపడతాయి. ఆహారం సులభంగా ముందుకు కదులుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్తి, కడుపు బరువుగా అనిపించడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.

బరువు నియంత్రణ..

క్రమం తప్పకుండా నడవడం వల్ల కేలరీలు కరిగిపోతాయి. తద్వారా ఊబకాయం ముప్పు తగ్గుతుంది. బరువు అదుపులో ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది.

ప్రశాంతమైన నిద్ర..

 తేలికపాటి నడక వల్ల శారీరక, మానసిక ఒత్తిడి తగ్గి, రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రాత్రి భోజనం తర్వాత కనీసం 15 నిమిషాల పాటు నడవడం అనేది చాలా చిన్న అలవాటుగా అనిపించినా, దీర్ఘకాలంలో ఇది ఎన్నో జీవనశైలి వ్యాధుల (Lifestyle diseases) బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి, ఈ రోజు నుంచే మీ దినచర్యలో ఈ చిన్న మార్పును ఆహ్వానించండి.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.