Bone Density : బోన్ డెన్సిటీ టెస్ట్ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : DEXA (Dual-Energy X-ray Absorptiometry) స్కాన్ అనేది ఎముకల సాంద్రతను (bone density) కొలిచే ఒక అధునాతనమైన, నొప్పిలేని ఎక్స్-రే పరీక్ష. ఇది ముఖ్యంగా ఎముకల్లో క్యాల్షియం, ఇతర మినరల్స్ ఎంతుందో నిర్ధారించి, 'ఆస్టియోపోరోసిస్' (osteoporosis) లేదా ఫ్రాక్చర్ల ముప్పును ముందుగానే పసిగడుతుంది. సాధారణ ఎక్స్-రేలతో పోలిస్తే ఇది అత్యంత కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది ఎముకల ఆరోగ్యాన్ని ఎలా లెక్కిస్తుంది..?
ఈ పరీక్షలో అతి తక్కువ మోతాదులో ఉండే రెండు రకాల ఎక్స్-రే కిరణాలను ఎముకల ముఖ్యంగా తుంటి, వెన్నెముక, మణికట్టు గుండా పంపుతారు. ఎముక ఎంత సాంద్రతతో ఉంటే, కిరణాలను అంతగా అడ్డుకుంటుంది. దీన్ని బట్టి ఎముకల బలాన్ని కంప్యూటర్ లెక్కిస్తుంది. దీని ఫలితాలను ప్రధానంగా T-Score రూపంలో ఇస్తారు. 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన యువతీయువకుల ఎముకల సాంద్రతతో మీ ఎముకల సాంద్రతను పోల్చి ఈ స్కోర్ నిర్ణయిస్తారు.
టీ-స్కోర్ -1.0 లేదా అంతకంటే 0 లేదా పాజిటివ్.. ఎక్కువగా ఉంటే మీ ఎముకలు పూర్తి ఆరోగ్యంగా, బలంగా ఉన్నట్లు. టీ-స్కోర్ -1.0 నుంచి -2.5 మధ్య ఉంటే.. ఎముకలు బలహీనపడటం (weak) మొదలైందని అర్థం. ఇది ఆస్టియోపోరోసిస్‌కు మొదటి దశ. ఆహారం, వ్యాయామంతో దీన్ని సరిచేసుకోవచ్చు. టీ-స్కోర్ -2.5 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఉదాహరణకు -2.8, -3.0.. ఎముకలు పూర్తిగా గుల్లబారిపోయాయని, ఏమాత్రం దెబ్బతగిలినా, కిందపడినా విరిగిపోయే (fracture) అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని అర్థం.
ఏ వయసు వారు ఈ పరీక్ష చేయించుకోవాలి..?
ఈ పరీక్షను ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, కింది వారు వైద్యుల సలహాతో కచ్చితంగా చేయించుకోవడం ఉత్తమం. 65 ఏళ్లు నిండిన మహిళలు, 70 ఏళ్లు నిండిన పురుషులు కనీసం ఒకసారి ఈ స్కాన్ చేయించుకోవాలి. మెనోపాజ్ దశలోని మహిళలు: రుతుక్రమం ఆగిపోయిన 50-65 ఏళ్ల లోపు మహిళలు, ముఖ్యంగా కీళ్ల నొప్పులు, బలహీనత ఉన్నవారు. ఫ్రాక్చర్ అయినవారు: 50 ఏళ్లు దాటిన తర్వాత కాలు జారి పడినప్పుడు లేదా చిన్న దెబ్బకే ఎముకలు విరిగిన వారు. మధుమేహం (diabetes), థైరాయిడ్, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, కీళ్ల నొప్పుల కోసం దీర్ఘకాలంగా 'స్టెరాయిడ్స్' వాడుతున్నవారు ఏ వయసులో ఉన్నా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
