రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..? 

సాక్షి లైఫ్ : రోగనిరోధక శక్తి .. దీనినే ఇమ్మ్యూనిటీ అని కూడా అంటారు. ఇది మన శరీరం వ్యాధులు, వైరస్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచు తుంది. ఇది మన ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు, జబ్బుల నుంచి బయటపడేందుకు, శరీరంలోని అనేక వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి చాలా కీలకమైనది.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

రోగనిరోధక శక్తిని పెంపొందించడం కోసం కొన్ని మార్గాలు 

సంతులిత ఆహారం..  

పండ్లు, కూరగాయలు, ఫైబర్, ప్రోటీన్ లాంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ "సి", విటమిన్ "డి", విటమిన్స్, జింక్, సెలీనియం వంటి మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఇమ్మ్యూనిటీని పెంచుకోవచ్చు.

 వ్యాయామం.. 

మితంగా వ్యాయామం చేయడం శరీరానికి మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జాగింగ్, యోగా, లేదా ఇతర శారీరక కసరత్తులు ఈ విషయంలో సహాయపడతాయి.

సరిపడా నిద్ర.. 

సరిగ్గా నిద్రపోవడం చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే పలురకాల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి శరీరానికి తగినంత రెస్ట్ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఒత్తిడిని తగ్గించడం.. 
 
 మనసు సంతోషంగా ఉండడం, ఒత్తిడిని తగ్గించడం కూడా ఇమ్మ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది. ధ్యానం, ఆనందకరమైన కార్యకలాపాలు ఇందుకోసం సహాయపడతాయి.

సరిపడా నీరు.. 

 సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలను తొలగిపోయి, శరీరం హైడ్రేట్ అవ్వడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన జీవనశైలి.. 

స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు మానేయడం ద్వారా కూడా మీ ఇమ్మ్యూనిటీని పెంచుకోవచ్చు.ఈ సూచనలను అనుసరించి, మీరు మీ రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని, ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : symptoms-immunity immune-system food-immune-system adult-immunity herd-immunity autoimmune-diseases immunity immune-system-support types-of-immunity how-does-the-immune-system-work-simple-explanation
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com