కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : గుండె మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. అంతేకాదు హృదయనాళ వ్యవస్థకు ప్రధానమైంది. శరీరం అంతటా రక్తాన్ని పంప్ చేసే రక్త నాళాల నెట్‌వర్క్ గుండెపై ఆధారపడుతుంది. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడానికి ఇతర శరీర వ్యవస్థలతో కూడా పనిచేస్తుంది. కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, జీవనశైలి వంటివి గుండె పని తీరును ప్రభావితం చేస్తాయి.
సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే..?
సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయడం ఆగిపోవడం లేదా రక్తం పంపింగ్ ఆగిపోతుంది. దీనికి ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. గుండెలో ఎలక్ట్రిక్ అలజడి తలెత్తడంవల్ల గుండె కొట్టుకోవడంలో సమతుల్యత దెబ్బతింటుంది.
అప్పుడు గుండె, మెదడుతోపాటు ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవించిన వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఇది ఎటువంటి హెచ్చరిక లేకుండాజరుగుతుంది. కాబట్టి, దీనిని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు.
ఇది కూడా చదవండి.. ఈ భూమ్మీద ఒక్క దోమ లేకుండా చేస్తే ఏం జరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.