SJS Side Effects Under Control : ఎస్జేఎస్ దుష్ప్రభావాలకు చెక్.. 4-లిడ్ MMG సర్జరీతో అమేజింగ్ రిజల్ట్..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తీవ్రమైన ఔషధ అలర్జీ లేదా ఇన్ఫెక్షన్ల వల్ల తలెత్తే స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ (SJS) అనంతర దుష్ప్రభావాలతో కంటి చూపు ప్రమాదంలో పడిన 59 ఏళ్ల మహిళకు సోమాజిగూడలోని మ్యాక్సి విజన్ కంటి వైద్య నిపుణులు వినూత్న శస్త్రచికిత్సతో ఉపశమనం కలిగించారు. నోటి బుగ్గ లోపలి శ్లేష్మ పొరను సేకరించి కనురెప్పలకు అమర్చే ‘మ్యూకస్ మెంబ్రేన్ గ్రాఫ్టింగ్’ (MMG) విధానం ద్వారా ఆమెను దీర్ఘకాలిక సమస్య నుంచి కాపాడారు.

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

కనురెప్పల లోపలి సున్నితమైన భాగం..

ఎస్జేఎస్ వ్యాధి బారిన పడిన వారిలో కనురెప్పల లోపలి సున్నితమైన భాగం గట్టిపడి గరుకుగా మారుతుంది. ఈ క్రమంలో రెప్ప మూసి తెరిచిన ప్రతిసారీ ఆ గరుకుదనం కనుగుడ్డు ఉపరితలాన్ని రాపిడికి గురిచేస్తుంది (Lid Wiper Keratopathy). ఈ బాధితురాలు కూడా గత రెండేళ్లుగా తీవ్రమైన కంటి మంట, వాపు, ఎరుపుదనంతో బాధపడుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం అధిక మోతాదులో స్టెరాయిడ్ చుక్కల మందులు, కంటిని తడిగా ఉంచే లూబ్రికెంట్లపై ఆధారపడాల్సి వచ్చేది. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల కంటి ఒత్తిడి పెరగడం (glaucoma), ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.

 చికిత్స ఏమిటి..? 

కంటి నిపుణులు రోగి పై, కింది రెప్పలు..మొత్తం నాలుగు కనురెప్పల అంచులకు ‘మ్యూకస్ మెంబ్రేన్ గ్రాఫ్టింగ్’ నిర్వహించారు. రోగి నోటి బుగ్గ లోపలి భాగాన ఉండే మృదువైన శ్లేష్మ పొరను (buccal mucosa) సేకరించారు. రాపిడిని కలిగిస్తున్న కనురెప్పల అంచులలో దెబ్బతిన్న పొరను తొలగించి, దాని స్థానంలో ఈ నోటి పొరను సూక్ష్మ కుట్లతో అమర్చారు. నోటి పొర సహజంగానే మృదువుగా ఉండి తేమను నిలుపుకోగలగడం వల్ల కనుగుడ్డుపై రాపిడి పూర్తిగా తగ్గింది.

మరుసటి రోజే అద్భుత ఫలితం..

శస్త్రచికిత్స పూర్తయిన మరుసటి రోజే రోగి కంటిలో గణనీయమైన మార్పు కనిపించింది. రెండేళ్లుగా ఎర్రబడి ఉన్న కన్ను వాపు తగ్గి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంది. ప్రమాదకరమైన స్టెరాయిడ్ చుక్కల మందులను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం కేవలం సాధారణ యాంటీబయాటిక్ (Moxifloxacin), లూబ్రికెంట్ డ్రాప్స్‌తోనే కన్ను స్థిరంగా ఉంది. బాధితురాలి కంటి ఉపరితలం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన అనంతరం, ఆమెకు ఉన్న కంటిశుక్లం తొలగించే తదుపరి శస్త్రచికిత్సకు సిద్ధం చేస్తున్నారు.

సమయానికి చికిత్స ముఖ్యం..

"ఎస్జేఎస్ అనంతర దుష్ప్రభావాల వల్ల కనురెప్పల అంచులు గరుకుగా మారినప్పుడు సొంత వైద్యంతో కాలయాపన చేయకూడదు. స్టెరాయిడ్లను దీర్ఘకాలం వాడితే ఇతర సమస్యలు వస్తాయి. అధునాతన మ్యూకస్ మెంబ్రేన్ గ్రాఫ్టింగ్ వంటి ప్రక్రియల ద్వారా కంటి ఉపరితలాన్ని కాపాడుకొని దృష్టి లోపాలు రాకుండా నివారించవచ్చు." -కంటి వైద్య నిపుణులు. 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు.. 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.