Eczema, Scabies & Itching : తామర, గజ్జి, దురద.. వీటి మధ్య తేడాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సాక్షి లైఫ్ : వర్షాకాలం వేడి నుంచి ఉపశమనం ఇచ్చినప్పటికీ, చర్మ సమస్యలను కూడా వెంటతెస్తుంది. ముఖ్యంగా వాతావరణంలో పెరిగే తేమ, చెమట వల్ల తామర, గజ్జి, దురద లాంటివి సర్వసాధారణం. అయితే, చాలామంది ఈ మూడింటినీ ఒకేలా భావిస్తుంటారు. కానీ వైద్యపరంగా వీటి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. సరైన సమయంలో వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
తామర, గజ్జి, దురద మధ్య తేడాలు ఏంటి..?
తామర (Ringworm)..
ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇందులో చర్మంపై ఎర్రటి గుండ్రటి మచ్చలు అంటే రింగ్స్ లాగా ఏర్పడతాయి. ఈ మచ్చల అంచులు కొద్దిగా ఉబ్బి ఉండి, విపరీతమైన దురదను కలిగిస్తాయి. ఇది స్పర్శ ద్వారా ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుంది.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
గజ్జి (Scabies / Severe Itch)..
గజ్జి అనేది తీవ్రమైన చర్మ సమస్య. ఇది కేవలం ఫంగస్ వల్ల మాత్రమే కాకుండా, బ్యాక్టీరియా, పరాన్నజీవులు, లేదా తీవ్రమైన ఎలర్జీల వల్ల కూడా రావచ్చు. ఇందులో చర్మంపై చిన్న చిన్న కురుపులు వచ్చి తీవ్రమైన అసౌకర్యం ఉంటుంది.
దురద (General Itching)..
దురద అనేది ఒక వ్యాధి కాదు, అది కేవలం ఒక లక్షణం మాత్రమే. చర్మం పొడిబారడం, చెమట, కీటకాలు కుట్టడం లేదా ఎలర్జీల వల్ల చర్మంపై దురద రావచ్చు. కాబట్టి ప్రతి దురదను ఫంగల్ ఇన్ఫెక్షన్గా పొరబడకూడదు.
వర్షాకాలంలో ఈ సమస్యలు ఎందుకు పెరుగుతాయి..?
ఈ కాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చెమట త్వరగా ఆరదు. ముఖ్యంగా గజ్జలు, చంకలు, కాలి వేళ్ల మధ్య తేమ ఎక్కువసేపు నిలిచిపోతుంది. ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ఈ వెచ్చని, తేమతో కూడిన వాతావరణం చాలా అనుకూలం. తడి బట్టలు, సాక్స్, బూట్లు ఎక్కువసేపు ధరించడం వల్ల కూడా ఈ ముప్పు రెట్టింపు అవుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వర్షంలో తడిసిన వెంటనే ఇంటికి రాగానే పొడి దుస్తులు మార్చుకోవాలి. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని, ముఖ్యంగా చర్మం మడతలు ఉండే భాగాలను గజ్జలు, చంకలు, వేళ్ల మధ్య పొడి టవల్‌తో పూర్తిగా తుడుచుకోవాలి. ఎక్కడా తేమ లేకుండా చూసుకోవాలి. బిగుతుగా ఉండే జీన్స్, సింథటిక్ దుస్తులకు బదులుగా, గాలి బాగా ఆడే కాటన్ దుస్తులను ధరించడం ఉత్తమం.
ఇతరుల తువ్వాళ్లు, దుస్తులు, సబ్బులు, దువ్వెనలు వాడకూడదు..
రోజూ ఉతికిన, పూర్తిగా ఆరిన సాక్స్ మాత్రమే వాడాలి. తడిసిన బూట్లను ఎక్కువసేపు వేసుకోకూడదు. చర్మంపై ఎర్రటి మచ్చలు పెరుగుతున్నా, దురద తీవ్రంగా ఉన్నా వెంటనే చర్మవ్యాధి నిపుణులను (Dermatologist) సంప్రదించాలి. సొంత వైద్యం చేస్తూ, మెడికల్ షాపుల్లో దొరికే స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ మరింత ముదిరే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
