Indoor Air Pollution: ఇంటి లోపలి కాలుష్యంతో వచ్చే అనారోగ్య సమస్యలు..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కాలుష్యం అనగానే రోడ్ల మీది వాహనాలు, ఫ్యాక్టరీల పొగ మాత్రమే గుర్తొస్తుంది, కానీ మనం అత్యంత సురక్షితం అనుకునే ఇంటి లోపలి గాలి కూడా బయటి గాలికంటే ఎక్కువ ప్రమాదకరంగా మారవచ్చు. వంట గదిలోని పొగ, సిగరెట్ పొగ, అగరుబత్తీలు, ధూళి, ఫంగస్ (fungus), రసాయన క్లీనర్ల కారణంగా ఏర్పడే ఈ 'ఇండోర్ ఎయిర్ పొల్యూషన్' (Indoor Air Pollution) మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

ఇంటి లోపలి కాలుష్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలు..

శ్వాసకోశ సమస్యలు..కంటికి కనిపించని సూక్ష్మ ధూళి కణాలు, పొగ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల గొంతు మంట, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి.

ఉబ్బసం ముప్పు (Risk of asthma)..

ఆస్తమా ఉన్నవారికి ఇంట్లోని బూజు, దుమ్ము, పొగ వల్ల ఆకస్మికంగా ఆయాసం, శ్వాసకోశ సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

ఎలర్జీలు, కళ్ల మంట..

 ఇంట్లో పేరుకుపోయే దుమ్ము, పెంపుడు జంతువుల నుంచి రాలే వెండ్రుకల వల్ల తుమ్ములు రావడం, ముక్కు కారడం, కళ్లు ఎర్రబడి నీరు కారడం లాంటి ఎలర్జీ సమస్యలు వస్తాయి. పిల్లల శ్వాస వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటుంది కాబట్టి, ఇంట్లో సిగరెట్ లేదా వంట పొగ వాళ్లకు చాలా హానికరం. దీనివల్ల వారిలో రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉంది.

తలనొప్పి, చికాకు..గాలి వెలుతురు సరిగ్గా రాని గదుల్లో (Poor ventilation) ఎక్కువసేపు ఉండటం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గి తలనొప్పి, కళ్లు తిరగడం, చికాకుగా అనిపిస్తుంది. కలుషితమైన గాలిని రోజూ పీల్చడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి సమస్య వచ్చే వరకు వేచి చూడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎవరు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి..?

చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అస్తమా, ఎలర్జీ సమస్యలు ఉన్నవారు ఇంట్లోని కాలుష్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఇంటి కిటికీలు తెరిచి ఉంచి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. వంటగది, బాత్రూమ్స్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడటం ద్వారా కలుషిత గాలి బయటకు వెళ్లేలా జాగ్రత్త పడాలి.

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.