Smartphone : స్మార్ట్‌ఫోన్లను గంటలకొద్దీ చూడటం వల్ల మెడ, వెన్నుముకపై తీవ్రమైన భారం పడుతుందా..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను ఒకే భుజంపై మోయడం, సరైన మద్దతు లేని మెత్తటి పరుపులపై పడుకోవడం మహిళలు హై హీల్స్ వాడటం వల్ల వెన్నుముకపై అదనపు ఒత్తిడి పడుతుందన్న విషయం మీకు తెలుసా? కూర్చునేటప్పుడు వీపు నిటారుగా ఉంచకుండా వంగి కూర్చోవడం, అలాగే తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల వెన్నుము కలోని డిస్క్‌లు డీహైడ్రేట్ అయి త్వరగా అరిగిపోతాయన్న వాస్తవం మీరు విన్నారా..? ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే దీర్ఘకాలంలో పెద్ద సమస్యలకు దారితీస్తాయని మీకు అర్థమవు తోందా..?చిన్న వయస్సులోనే యువతలో వెన్నునొప్పి ఎందుకు అంత సాధారణ సమస్యగా మారుతోంది? గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, కండరాల బలహీనత దీనికి ప్రధాన కారణాలు కావా? తల దించుకుని స్మార్ట్‌ఫోన్లను గంటలకొద్దీ చూడటం వల్ల మెడ, వెన్నుముకపై తీవ్రమైన భారం పడి 'టెక్స్ట్ నెక్' (Text Neck) అనే సమస్య రావడం మీరెప్పుడైనా గమనించారా? ఇలాంటి ఆధునిక జీవనశైలి మార్పులు మన వెన్నుముక సహజ ఆకృతిని దెబ్బతీస్తూ, చిన్న వయస్సులోనే తీవ్రమైన నొప్పులకు దారితీస్తున్నాయి కదా?మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా.సీఎల్ వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.