videos
జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేస్తే ఛాతిలో మంట, అల్సర్లు మళ్లీ రాకుండా నివారించవచ్చు..?
సాక్షి లైఫ్ : తరచూ నోటిలో పుల్లటి రుచి, గొంతులో మంట, గొంతు బొంగురుపోవడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం కూడా అల్సర్ లక్షణాలేనా..? కడుపు అల్సర్, డ్యూడెనల్ అల్సర్ మధ్య తేడా ఏమిటి..? ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి..? రక్తస్రావం, రక్త వాంతులు, నల్లటి మలం వంటి లక్షణాలు ఎంత ప్రమాదకరం..? అల్సర్ క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందా..? ఎప్పుడు ఎండోస్కోపీ అవసరం అవుతుంది..? ఇంటి చిట్కాలతో తగ్గుతుందా..? లేక వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలా..? తరచూ యాంటాసిడ్ మందులు వాడటం సురక్షితమేనా..? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..? ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి..? అల్సర్ నొప్పి, గుండెపోటు నొప్పిని ఎలా గుర్తించాలి..?పాలు, పెరుగు, మజ్జిగ, అరటిపండు నిజంగా ఉపశమనం ఇస్తాయా..? రోజులో ఎన్ని సార్లు భోజనం చేయాలి..? యోగా, ప్రాణాయామం, బరువు తగ్గడం వల్ల ప్రయోజనం ఉంటుందా..? ఛాతిలో మంట వచ్చిన ప్రతిసారీ సాధారణ సమస్యగా భావించాలా..? లేక ఎలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి..? ఛాతిలో మంట లేదా అల్సర్లతో బాధపడుతున్నారా..? ఈ సమస్యకు అసలు కారణాలేమిటి..? అసిడిటీ, GERD, అల్సర్ మధ్య తేడా ఏమిటి..? ఛాతిలో మంట అంటే ప్రతిసారీ గుండె సమస్యేనా..? లేక కడుపు సమస్యా..? H. pylori బ్యాక్టీరియా వల్ల అల్సర్లు ఎలా వస్తాయి..? ఒత్తిడి (Stress), మసాలా ఆహారం, జంక్ ఫుడ్, టీ, కాఫీ, మద్యం, ధూమపానం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం, తరచూ నొప్పి నివారణ మందులు వాడటం అల్సర్లకు ఎంతవరకు కారణమవుతాయి..? పిల్లలు, యువత, గర్భిణీలు, వృద్ధుల్లో ఈ సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తోంది..? ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకున్నప్పుడు ఛాతిలో మంట రావడానికి కారణాలేమిటి..? భోజనం చేసిన వెంటనే మంట ఎందుకు వస్తుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
