videos
Iron-Rich Foods : ఐరన్ సమృద్ధిగా ఉన్న సహజ ఆహారాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ప్రెగ్నెన్సీ టైమ్ లో ఐరన్ టాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? సహజ ఆహారంతోనే అనీమియాను నియంత్రించ గలమా? గర్భధారణలో ఐరన్ అధికంగా తీసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఐరన్ ఫుడ్స్ ఏమిటి? హిమోగ్లోబిన్ స్థాయిని ఎంతకాలానికి ఒకసారి పరీక్షించుకోవాలి..? హిమోగ్లోబిన్ తగ్గితే తల్లి, శిశుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గర్భిణీలు రోజుకు ఎంతమాత్రం ఐరన్ తీసుకోవాలి? గర్భధారణలో ఐరన్ లోపం లక్షణాలు ఏమిటి? గర్భధారణ సమయంలో ఐరన్ ఎందుకు ముఖ్యమైంది అంటే..? పాలకూర, బీట్‌రూట్, దానిమ్మ వంటివి హీమోగ్లోబిన్ పెంచడంలో ఎలా సహాయపడతాయి..? జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ఐరన్ స్థాయిని పెంచుతాయా? పప్పులు, శనగలు, పెసర్లు గర్భిణీలకు ఎంత ప్రయోజనకరం? ఐరన్ శోషణ (absorption) మెరుగుపడేందుకు విటమిన్ సి పాత్ర ఏమిటి? టీ, కాఫీ వంటి పానీయాలు ఐరన్ శోషణను తగ్గిస్తాయా? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. సుభాషిణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
