Powerful Immunity : రోగనిరోధక శక్తికి ‘సి’ ప్లస్ ‘డి’.. రెండూ ఉంటే మన ఆరోగ్యానికి సూపర్‌ ప్రొటెక్షన్..!

షేర్ చేయండి:
Powerful Immunity : రోగనిరోధక శక్తికి ‘సి’ ప్లస్ ‘డి’.. రెండూ ఉంటే మన ఆరోగ్యానికి సూపర్‌ ప్రొటెక్షన్..!

సాక్షి లైఫ్ : శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఏ విటమిన్ అత్యంత ముఖ్యం? విటమిన్ ‘సి’ నా లేక విటమిన్ ‘డి’ నా.? చాలా మందిని వేధించే ప్రశ్న ఇది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తోంది. ఫలితంగా తరచూ జలుబు, అలసట, ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత ఇమ్యూనిటీపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెరిగింది. మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 

ఇన్‌ఫెక్షన్లపై అస్త్రం..

విటమిన్ ‘సి’ని రోగనిరోధక శక్తిని పెంచే ప్రధాన పోషకంగా పరిగణిస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్ కావడం వల్ల శరీరం దీనిని నిల్వ ఉంచుకోలేదు. అందుకే ప్రతిరోజూ ఆహారం ద్వారా దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో ఇన్‌ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాల (WBC) ఉత్పత్తిని, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంది.

శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్..

 శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

త్వరిత ఉపశమనం..

 జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల తీవ్రతను, అవి తగ్గే సమయాన్ని తగ్గించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది.

లభించే వనరులు..

 నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, క్యాప్సికమ్, స్ట్రాబెర్రీ వంటి సిట్రస్ జాతి పండ్లలో ఇది పుష్కలంగా దొరుకుతుంది.

విటమిన్ డి..రోగనిరోధక కణాల నియంత్రణ..

విటమిన్ ‘డి’ కేవలం ఎముకల పుష్టికే పరిమితం కాదు, రోగనిరోధక వ్యవస్థ సజావుగా పనిచేయడానికి ఇది ఒక ఇంధనం లాంటిది.

టీ-కణాల ఉత్తేజం: శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియాలను గుర్తించి నాశనం చేసే 'టి-కణాలు' (T-Cells), ఇతర రోగనిరోధక కణాలను ఇది ఉత్తేజపరుస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ.

లభించే వనరులు..

ఉదయం పూట సూర్యరశ్మి ద్వారా ఇది సహజంగా లభిస్తుంది. ఆధునిక కాలంలో ఎక్కువ సమయం ఇళ్లకే పరిమితం కావడం వల్ల చాలా మంది ఈ లోపంతో బాధపడుతున్నారు. ఆహారం విషయానికి వస్తే.. గుడ్డు పచ్చసొన, ఫ్యాటీ ఫిష్, పుట్టగొడుగులు, పోషకాలు జోడించిన పాల ఉత్పత్తుల ద్వారా దీనిని పొందవచ్చు.

ఏది అత్యంత ముఖ్యం..?

వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం..రోగనిరోధక శక్తికి విటమిన్ సి, విటమిన్ డి రెండూ సమానంగా ముఖ్యం. ఈ రెండింటి విధులు వేర్వేరు. ఒకటి ఇన్‌ఫెక్షన్లపై తక్షణమే స్పందిస్తే, మరొకటి రోగనిరోధక కణాలను దీర్ఘకాలం బలోపేతం చేస్తుంది. కాబట్టి రెండింటిలో దేని లోపమైనా అనారోగ్యానికి దారితీస్తుంది. కేవలం విటమిన్ సప్లిమెంట్లు (tablets) వేసుకోవడం వల్లే పూర్తి రోగనిరోధక శక్తి రాదు. పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం, నిత్యం వ్యాయామం, తగినంత నిద్ర , ఒత్తిడి లేని జీవనశైలి తోడైనప్పుడే శరీరం ఏ రకమైన ఇన్‌ఫెక్షన్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కోగలదు.

చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.