videos
డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?
సాక్షి లైఫ్ : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే..? మహిళలు డిప్రెషన్ ను ఎలా అధిగమించవచ్చు..? డిప్రెషన్ కు కారణాలు..? భర్తను భార్య, భార్యను భర్త గౌరవించకపోతే ఏమి జరుగుతుంది..? భార్య, భర్తల దాంపత్యం ఎలా వుండాలి..? డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? ఎలాంటి లక్షణాలుంటే డిప్రెషన్ గా భావించాలి..? మానసిక సమస్యలకు ప్రధాన కారణాలేమిటి..? నెగిటివ్ ఆలోచనలను ఎలా తొలగించాలి..? మెనూ పాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ. మహిళలు సుమారు 45-55 సంవత్సరాల వయస్సులో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీని కారణంగా నెలసరి ఆగిపోతుంది. మెనూ పాజ్ సమయంలో హార్మోనల్ మార్పులు, ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల, శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మెనోపాజ్ కు మానసికసమస్యలకు ఏంటి లింక్..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
