Menopause : మెనోపాజ్‌తో పెరగనున్న హైబీపీ ముప్పు వాటర్లూ వర్సిటీ తాజా పరిశోధన

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళల జీవితంలో మెనోపాజ్ అనేది శారీరకంగా, మానసికగానే కాకుండా గుండె ఆరోగ్యపరంగానూ కీలకమైన మలుపు. సాధారణంగా 40 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండే మహిళల్లో రక్తపోటు (Hypertension) పెరగడం మనం గమనిస్తుంటాం. అయితే, మెనోపాజ్ దశకు ముందు మహిళల్లో బీపీ ఎందుకు అదుపులో ఉంటుంది? ఆ తర్వాత ఒక్కసారిగా ఎందుకు పెరుగుతుంది..? అనే అంశంపై కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

ఈస్ట్రోజన్ తగ్గుదలే ప్రధాన కారణం..

మహిళా హార్మోన్ అయిన ‘ఈస్ట్రోజన్’ కేవలం ప్రత్యుత్పత్తి వ్యవస్థకే కాకుండా శరీరంలోని ఇతర అవయవాల పనితీరులోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ రక్తనాళాలను రిలాక్స్ చేసి, అవి వెడల్పుగా (Vasodilation) ఉండేలా చేస్తుంది. దీనివల్ల రక్తం సులభంగా ప్రవహించి బీపీ అదుపులో ఉంటుంది.

మెనోపాజ్‌లో మార్పులు.. 

మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల రక్తనాళాలు బిరుసుగా మారడం (Stiffening of arteries), ఉప్పు పట్ల శరీరం అధిక సున్నితత్వం ప్రదర్శించడం వంటి మార్పులు జరుగుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.

కిడ్నీలు, రక్తపోటు మధ్య లంకె..  

పరిశోధకులు అభివృద్ధి చేసిన ప్రత్యేక గణిత నమూనా (Mathematical Model) ప్రకారం.. ఈస్ట్రోజన్ ప్రభావం శరీరంలోని ‘రెనిన్-ఆంజియోటెన్సిన్’ వ్యవస్థపై ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను, రక్త పరిమాణాన్ని నియంత్రిస్తుంది. మెనోపాజ్ తర్వాత ఈ హార్మోన్ లేకపోవడం వల్ల కిడ్నీలు ద్రవాలను నియంత్రించే పద్ధతిలో మార్పులు వచ్చి రక్తపోటుకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.


చికిత్సలో ఏది మేలు..?

రక్తపోటు చికిత్సలో వాడే మందులు మహిళలపై ఎలా పనిచేస్తాయనే అంశాన్ని కూడా ఈ అధ్యయనం పరిశీలించింది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గినా, రక్తపోటును అదుపు చేయడంలో 'ఆంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్' (ARBs) మందులు.. 'ఏసీఈ' (ACE) ఇన్హిబిటర్ల కంటే మెరుగ్గా పనిచేస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. కోల్పోయిన హార్మోన్లను భర్తీ చేయడం (Bioidentical Estrogen) ద్వారా మహిళల్లో గుండె జబ్బుల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వైద్యులేమంటున్నారు..?

 చాలా కాలంగా మహిళల ఆరోగ్యాన్ని కేవలం ప్రత్యుత్పత్తి కోణంలోనే చూస్తున్నారు. కానీ వయస్సు, లింగ భేదాలను బట్టి చికిత్స అందించడం అత్యవసరం. మహిళల్లో మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులే. కాబట్టి మెనోపాజ్ దశలో వచ్చే రక్తపోటును నిర్లక్ష్యం చేయకూడదు" అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ అనితా లేటన్ పేర్కొన్నారు. 40 ఏళ్లు పైబడిన మహిళలు క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్  బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.