Monsoon Infections in Women: వర్షాకాలంలో మహిళలు ఎదుర్కొనే ప్రధాన ఇన్ఫెక్షన్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, మహిళల ఆరోగ్యానికి ఇది కాస్త సవాలుతో కూడుకున్న సమయమనే చెప్పాలి. వాతావరణంలో పెరిగే తేమ, తడి బట్టలు, చెమట కారణంగా ఈ సీజన్‌లో బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వ్యాప్తి చెందుతాయి. దీనివల్ల మహిళల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఈ కాలంలో మహిళలు ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యలు, వాటి నివారణోపాయాలపై సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం మీకోసం..

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

1. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI)..  

వర్షాకాలంలో మహిళలను ఎక్కువగా వేధించే సమస్యల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ఒకటి. వాతావరణంలో తేమ శాతం పెరగడం, బ్యాక్టీరియా చేరడం వల్ల మూత్రాశయం, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి.

లక్షణాలు.. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, పొత్తికడుపులో నొప్పులు. జాగ్రత్తలు..రోజూ తగినంతగా కనీసం 3 లీటర్లు నీరు తాగాలి.
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. కాటన్ లోదుస్తులను మాత్రమే ధరించాలి. తడి బట్టలను వెంటనే మార్చుకోవాలి.

2. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు..

వర్షంలో తడవడం లేదా చెమట వల్ల ప్రైవేట్ భాగాల్లో తేమ ఎక్కువగా చేరి ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.
లక్షణాలు.. జననాంగాల వద్ద తీవ్రమైన దురద, మంట, ఎరుపుదనం, తెల్లటి స్రావాలు (White Discharge). జాగ్రత్తలు..వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం మంచిది. జిన్స్ వంటి బిగుతు దుస్తులను తగ్గించాలి. సువాసనలు, కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రైవేట్ వాష్‌లను ఉపయోగించకపోవడం శ్రేయస్కరం.

3. స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు..

మెడ, చంకలు, గజ్జలు, చర్మపు మడతలు ఉండే భాగాల్లో తడి లేదా చెమట పేరుకుపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి.లక్షణాలు..చర్మంపై ఎర్రటి దద్దుర్లు, రింగ్‌వార్మ్ (తామర), విపరీతమైన దురద. జాగ్రత్తలు..స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తువ్వాలుతో పూర్తిగా తుడుచుకుని పొడిగా ఉంచుకోవాలి. ఇతరుల దుస్తులు, తువ్వాళ్లను షేర్ చేసుకోకూడదు. సమస్య తీవ్రంగా ఉంటే సొంత వైద్యం కాకుండా.. డాక్టర్ సలహాతోనే క్రీములు వాడాలి.

4. బాక్టీరియల్ వాగినోసిస్ (Bacterial Vaginosis)..

శరీరంలో మంచి, చెడు బ్యాక్టీరియాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. వర్షాకాలంలో పెరిగే హ్యుమిడిటీ ఇందుకు ప్రధాన కారణం. లక్షణాలు..ప్రైవేట్ భాగాల నుంచి దుర్వాసన రావడం, అసాధారణ స్రావాలు కావడం. జాగ్రత్తలు..వ్యక్తిగత పరిశుభ్రతకు (Personal Hygiene) ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. తేలికపాటి, పోషకాలున్న ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.

5. చర్మ అలర్జీలు.. 

బయట కురిసే వర్షపు నీరు, రోడ్లపై ఉండే మురికి నీరు చర్మానికి తగలడం వల్ల పలు రకాల అలర్జీలు వస్తాయి. లక్షణాలు..చర్మం ఎర్రబడటం, దురద, దద్దుర్లు రావడం. జాగ్రత్తలు..బయటి నుంచి ఇంటికి రాగానే చేతులు, కాళ్లను యాంటీసెప్టిక్ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వర్షంలో పూర్తిగా తడిస్తే.. వెంటనే తలస్నానం చేయడం మంచిది. వర్షాకాలంలో వచ్చే ఎలాంటి ఇన్ఫెక్షన్నైనా నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభంలోనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. పరిశుభ్రత, సరైన ఆహార నియమాలే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.