మెంతులతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయా..?

సాక్షి లైఫ్ : పాలిచ్చే తల్లులకు పాలు పడటం కోసం మెంతి పొడిని వాడతారు. దీని వల్ల పిల్లలకు ఎటువంటి హాని జరగదు. కానీ మెంతి సప్లిమెంట్లను తీసుకునే ముందు గర్భిణీలు, పాలిచ్చే మహిళలు ఖచ్చితంగా వైద్య నిపుణులను సంప్రదించాలి. లేదంటే అనేక దుష్ప్రభావాలకు గురికావాల్సి వస్తుంది. కొన్నిరకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఐతే కొన్ని సందర్భాల్లో అతిగా తినడం వల్ల దుష్ప్రభావాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెంతుల ద్వారా కొన్నిరకాల ఆరోగ్య ప్రయోజనాలుపొందినప్పటికీ  మరికొన్ని సందర్భాల్లో మాత్రం దుష్ప్రభావాలు రావొచ్చు.. అవేంటంటే..?  

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

గర్భిణీలు తప్పనిసరిగా మెంతి సప్లిమెంట్లు లేదా మందులకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే గర్భాశయ సంకోచాలు పెరిగి అవి శిశువుపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందట. అంతేకాదు ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. 

మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్.. 

డెలివరీకి ముందు మెంతులు తీసుకోవడం వల్ల శిశువుల మూత్రం, శరీరం నుంచి ఒరకమైన వాసన వస్తుంది. ఈ వాసన ప్రమాదకరం కాదు. ఐనప్పటికీ, "మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్" అనే జన్యుపరమైన పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఈస్ట్రోజెన్.. 

మెంతులు శరీరంపై ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్‌లలో ఈస్ట్రోజెన్ ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందని అందుకోసమే మెంతి సప్లిమెంట్లను ఉపయోగించాలనుకున్నప్పుడు  తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. మరికొందరిలో అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అంతేకాదు వికారంగా, తలనొప్పిగా, తలతిరిగినట్లుగా కూడా అనిపిస్తుంది. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : fenugreek-benefits fenugreek-women-health-care fenugreek benefits-of-fenugreek health-benefits-of-fenugreek fenugreek-seeds fenugreek-side-effects side-effects-of-fenugreek fenugreek-benefits-for-men fenugreek-benefits-for-women general-side-effects-of-fenugreek fenugreek-seeds-benefits side-effects-of-fenugreek-seeds health-benefits-of-fenugreek-seeds fenugreek-health-benefits fenugreek-tea-side-effects

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com