ఒరిజినల్ బాదంను ఎలా గుర్తించాలి..? 

షేర్ చేయండి:
ఒరిజినల్ బాదంను ఎలా గుర్తించాలి..? 

 

సాక్షి లైఫ్ : భారతదేశంలో పండుగ ఏదయినా, డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల ఆహారపదార్థాలను ఒరిజినలా..? కాదా..? అనేది తెలుసుకోవాలనుకున్నపుడు వాటిని ఎలా గుర్తించాలో తెలియకపోవచ్చు. కొన్నిరకాల గుర్తుల ద్వారా అవి నాణ్యమైనవా..? కావా..? తెలుసుకోవచ్చు. ఐతే బాదం నకిలీవా..? ఒరిజినలా..? అని తెలుసుకోవాలంటే తప్పకుండా ఇవి ఫాలో అవ్వాలి. 

నకిలీ వస్తువులు..

ప్రస్తుతం మార్కెట్‌లో చాలా నకిలీ వస్తువులు దొరుకుతున్నాయి. దుకాణదారులు ప్రతి ఒరిజినల్ సరుకులో నకిలీ వస్తువులను కలుపుతున్నారు. ఈ రోజుల్లో, చాలా కల్తీ వస్తువులు పెరిగిపోతున్నాయి. అటువంటివాటిని తిని తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యేపరిస్థితి ఏర్పడవచ్చు. ఈ కల్తీ ఆహారం వల్ల మధుమేహం, క్యాన్సర్, తీవ్రమైన కడుపు సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. నకిలీ బాదం, అసలు బాదంల మధ్య తేడాను గుర్తించవచ్చు. అదెలా అంటే..? 

నకిలీ బాదంను ఎలా గుర్తించాలి..?

బాదంలో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. ఈ బాదం విషయంలో కల్తీ చేయడం వల్ల అవి నకిలీవిగా కనిపించవు. ఈ ట్రిక్స్ తో మీరు బాదం నిజమైనవో, నకిలీవో తెలుసుకోవచ్చు.

నిజమైన-కిలీ బాదంను గుర్తించడానికి, ముందుగా బాదంని మీ చేతుతో  రుద్దండి. బాదంపప్పును రుద్ధితే రంగు చేతులకు అంటుతుంది. కాబట్టి అది నకిలీదని, అందులో కల్తీ ఉందని గుర్తించాలి. దీన్ని తయారు చేయడానికి, దాని పైన పౌడర్ చల్లుతారు.

నిజమైన బాదం రంగు గోధుమ రంగులో ఉంటుంది. అయితే నకిలీ బాదంపప్పు రంగు చాలా ముదురు రంగులో ఉంటుంది. 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.