హిమోఫిలియా వ్యాధి గ్రస్తులకు అండగా ఏపీ సీఎం వైఎస్ జగన్  

షేర్ చేయండి:
హిమోఫిలియా వ్యాధి గ్రస్తులకు అండగా ఏపీ సీఎం వైఎస్ జగన్  

సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమోఫిలియా వ్యాధి గ్రస్తులకు అండగా నిలుస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేసి వైద్య సేవలు అంది స్తున్నారు. తాజాగా రాజమండ్రిలో హిమోఫిలియాతో బాధపడుతున్న బాలుడికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించారు వైఎస్ జగన్. 

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.15 లక్షల విలువైన ఇంజక్షన్ ను అందజేశారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో హిమోఫిలియా వ్యాధి తోబాధపడుతున్న బాలుడికి అరుదైన ఇంజక్షన్ ఇచ్చారు వైద్యులు. ఇంటిగ్రేటెడ్‌ సెంటర్‌ ఫర్‌ హిమోగ్లోబినోపతీస్‌, హిమో ఫిలియా (ఐసీహెచ్‌హెచ్‌) టెస్టింగ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్టణం, ఈస్ట్‌ గోదావరి, గుంటూరుతో పాటు కర్నూలులోనూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు సేవలందిస్తున్నారు.

ఇలాంటి  కేంద్రంలో పది పడకలు ఉంటాయి. తలసీమియాతో పాటు సికిల్‌సెల్‌, హిమోఫిలియా బాధితులకు చికిత్స అందించనున్నారు. ఇందుకోసం టెస్టింగ్‌ సెంటర్‌లో ఒక పాథాలజిస్టు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లను ఉంచారు. వీరితో పాటు చికిత్స చేసేందుకు సీనియర్‌ ఫిజీషియన్‌, చిన్నపిల్లల వైద్యులనూ ఏర్పాటు చేశారు.  
 
బాధితులకు ప్రత్యేక పింఛను..  

హిమోఫిలియా వ్యాధిపీడితులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలబడుతున్నారు. వీరికి అవసరమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా రూ.10వేల ప్రత్యేక పెన్షన్‌ ఇస్తున్నారు.

 ఉచిత చికిత్స.. 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకోండి..
 

హిమోఫిలియా బాధితులకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు, చికిత్సలను అందించేందుకు పలు జిల్లా ఆసుపత్రుల్లో ఐసీహెచ్‌హెచ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వారికోసంఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లో జనరల్‌ ఫిజీషియన్‌తో పాటు చిన్నపిల్లల వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. అంతేకాదు బాధితులకు అవసరమైన పరీక్షలు, కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు వైద్యులు, సిబ్బంది నియమించారు. 
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.