హిమోఫిలియా వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకోండి..

సాక్షి లైఫ్ : హిమోఫిలియా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన ఎంతైనా అవసరం. హిమోఫిలియా వ్యాధి దీని లోపం వల్ల వస్తుంది..?  హిమోఫిలియా ఇతర పేరు ఏమిటి..? హిమోఫిలియా వ్యాధులు ఎన్ని రకాలు..? హిమోఫిలియా ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి..?పురుషులలో హిమోఫిలియా ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది..? హిమోఫిలియా నయం అవుతుందా..?

హిమోఫిలియా ఉన్నవ్యక్తి జీవిత కాలం ఎంత..? హిమోఫిలియా ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది..? హిమోఫిలియా ఉన్నవారు ఏమేం చేయకూడదు.. హిమోఫిలియాకు మొదటి చికిత్స ఏమిటి..? వ్యాధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. 

హిమోఫిలియా..? 

హిమోఫిలియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధులలో ఒకటి. 20వేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశా లుంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారికి కండరాలు, జాయింట్‌ల వద్ద దెబ్బలు తగిలితే తీవ్ర రక్తస్రావం అవుతుంది. 

ఐతే  హిమోఫిలియాలో రెండు రకాలున్నాయి. వీటిలో ఒకటి హిమోఫిలియా ఏ . ఇది ఫ్యాక్టర్‌ 8 లోపం కారణంగా వస్తుంది. రెండోది హిమోఫిలియా బి. ఇది ఫ్యాక్టర్‌ 9లోపించడం వల్ల తలెత్తుతుంది. రక్తం గడ్డకట్టే విధానాన్ని కోల్పోవడం వల్ల తీవ్ర రక్తస్రావం అవుతుంది. దీనికి జెనటిక్‌ కౌన్సిలింగ్‌తో పాటు అవసరమైన వారికి కోల్పోయిన బ్లడ్‌ ఫ్యాక్టర్స్‌ ఎక్కించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. 

 హిమోఫిలియా వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది.. ?

రక్తంలో థ్రోంబోప్లాస్టిన్ అనే పదార్ధం లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. థ్రోంబోప్లాస్టిక్‌కు రక్తాన్ని త్వరగా గడ్డగా మార్చే సామర్థ్యం ఉంటుంది. ఇది రక్తంలో లేకపోవడం వల్ల రక్తస్రావం ఆగదు. దీని కారణంగా హిమోఫిలియా వ్యాధి వచ్చిన వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది.  

 హిమోఫిలియాకు మరొక పేరు..?

హిమోఫిలియాను బ్రిటిష్ రాయల్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది జన్యుపరమైన వ్యాధి, దీనిలో రక్తం గడ్డకట్టదు.

 హిమోఫిలియా వ్యాధులు ఎన్ని రకాలు..?

సాధారణంగా హిమోఫిలియా వ్యాధి రెండు రకాలు. హిమోఫిలియా A , హిమోఫిలియా B. హిమోఫిలియా A కారకం 8 లోపానికి కారణమవుతుంది.

 హిమోఫిలియా ఎలాంటివారిలో ఎక్కువగా వస్తుంది..? 

హిమోఫిలియా అనేది వంశపారంపర్య రక్తస్రావం రుగ్మత, ఇది ప్రధానంగా పురుషులలోనే ఎక్కువగా వస్తుంది. స్త్రీలలో అరుదుగా వచ్చేఅవకాశం ఉంటుంది. 

 పురుషులలో హిమోఫిలియా ఎందుకు ఎక్కువగా వస్తుందంటే..?

పురుషులు X క్రోమోజోమ్‌లో ఉన్న ఏదైనా జన్యువు కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా, హీమోఫిలియా A వంటి X- లింక్డ్ డిజార్డర్స్ మగవారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

 హిమోఫిలియా నయం చేయవచ్చా..?

తీవ్రమైన రక్తస్రావం రుగ్మత అయిన హీమోఫిలియాకు చాలా ఖర్చవుతుంది. యూఎస్ రెగ్యులేటర్లు CSL బెహ్రింగ్ హీమోఫిలియా B జన్యు చికిత్సను ఆమోదించారు. ఇది రోగులను సాధారణ చికిత్సల నుంచి విముక్తి చేస్తుంది. కానీ ఒక మోతాదుకు రూ. 35లక్షలు ఖర్చవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం.

  హిమోఫిలియాఉన్న వ్యక్తి జీవిత కాలం ఎంత..?

రోగులకు తగిన చికిత్స అందుతుందా లేదా అనేదానిపై ఆధారపడి హీమోఫిలియాలో ఆయుర్దాయం మారుతూ ఉంటుంది. సరైన చికిత్స అందక చాలా మంది రోగులు యుక్తవయస్సు రాకముందే మరణిస్తున్నారు. సరైన చికిత్సతో, ఆరోగ్యవంతమైన పురుషుల కంటే ఆయుర్దాయం 10 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది.

 హిమోఫిలియా రోగులకు ఉత్తమమైన ఆహారం ఏది..?

హిమోఫీలియా ఉన్నవారు ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలలో ఆకుకూరలు, మాంసం, కోడిగుడ్లు, బచ్చలికూర, బ్రోకలీ,  బీన్స్, తృణధాన్యాలు ,ఎండుద్రాక్ష వంటివి ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. 

 హిమోఫిలియాతో బాధపడేవారు ఏమి చేయకూడదు..?

ఫుట్‌బాల్, హాకీ లేదా రెజ్లింగ్ వంటి వాటికీ హిమోఫిలియా ఉన్నవారు దూరంగా ఉండాలి. కొన్ని నొప్పి నివారణ మందులను నివారించాలి.   ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ ,అడ్విల్, మోట్రిన్ వంటి మందులు రక్తస్రావానికి కారణం అవుతాయి. కాబట్టి వీటి బదులుగా, ఎసిటమైనోఫెన్ ,టైలెనాల్ వంటివి ఉపయోగించాలని వైద్యలు సూచిస్తున్నారు.  

హిమోఫిలియాకు చికిత్స ఏమిటి..?

హిమోఫిలియా చికిత్సకు ఉత్తమ మార్గం రక్తం గడ్డకట్టే కారకాలను భర్తీ చేయడం, తద్వారా రక్తం సరిగ్గా గడ్డకట్టవచ్చు. ఇది సాధారణంగా ఒక వ్యక్తి సిరలోకి క్లాటింగ్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్స్ అని పిలిచే చికిత్స, ఉత్పత్తులను ఇంజెక్ట్ చేయడం ద్వారా జరుగుతుంది.

ఇది కూడా చదవండి.. లివర్ ఇన్ఫెక్షన్ ఐతే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

Tags : research hemophilia

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com