అపోలో-ఇరాక్ అంతర్గత భద్రతా దళాల ఆసుపత్రి మధ్య కీలక ఒప్పందం

షేర్ చేయండి:
అపోలో-ఇరాక్ అంతర్గత భద్రతా దళాల ఆసుపత్రి మధ్య కీలక ఒప్పందం

సాక్షి లైఫ్ : ఆరోగ్య రంగంలో అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) మరో కీలక ఒప్పందంతో అంతర్జాతీయ స్థాయిలో తమ సేవలను విస్తరించింది. ఇరాక్ పౌరులకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో, ఇరాకీ అంతర్గత భద్రతా దళాల ఆసుపత్రి (Internal Security Forces Hospital, Iraqi Ministry of Interior) తో అపోలో హాస్పిటల్స్ ఒక ముఖ్యమైన ఒప్పంద సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించింది.

 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ వేదికగా జరిగిన ఈ చారిత్రక కార్యక్రమానికి ఇరాక్ మంత్రిత్వ శాఖ (Iraq Ministry) ప్రతినిధులతో పాటు, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రతాప్ సి. రెడ్డి (Dr. Prathap C. Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ భాగస్వామ్యం ద్వారా అపోలో హాస్పిటల్స్, ఇరాక్‌లోని అంతర్గత భద్రతా దళాల ఆసుపత్రికి వైద్య సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ అందించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వైద్య రంగంలో బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అపోలో యాజమాన్యం ప్రకటించింది.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.