బర్డ్ ఫ్లూపై కేంద్ర సర్కారు అలర్ట్..
సాక్షి లైఫ్ : బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, మహారాష్ట్రలోని నాగపూర్, కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఝార్ఖండ్ లోని రాంచీలలో దాని వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
అప్రమత్తం..
ఈ నేపథ్యంలో పౌల్ట్రీలు, ఇతర పక్షులకు సంబంధించి అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని, ఆ విషయాన్ని వెంటనే పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ప్రభుత్వం సూచించింది.
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా..
అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మనుషులకూ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వ్యాధి సంక్రమణను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పేర్కొంటూ మే 25న ఎన్సీడీసీ, కేంద్ర పశుసంవర్ధక శాఖలు కలిసి సంయుక్తంగా జారీ చేసిన ప్రకటనలో వెల్లడించాయి.
యాంటీవైరల్ మందులు, పీపీఈ కిట్లు, మాస్కులు వంటివి అందుబాటులో ఉండాలని, ఇన్ఫెక్షన్ సోకిన పక్షులను వధించే వారితోపాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకొని H5N1 పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. ఇంట్లోకి దోమలు రాకుండా చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
