41మందుల ధరలను తగ్గించిన ఎన్‌పీపీఏ  

షేర్ చేయండి:
41మందుల ధరలను తగ్గించిన ఎన్‌పీపీఏ  

సాక్షి లైఫ్ : మధుమేహం, గుండె , కాలేయ సంబంధిత వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 మందులతోపాటు, ఆరు ఫార్ములేషన్ల ధరలను కేంద్ర సర్కారు తగ్గించింది. నిత్యావసర ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు143వ సమావేశంలో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ)ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

 తగ్గిన మందుల జాబితాలో.. 

మధుమేహం, గుండె, కాలేయ వ్యాధులకు సంబంధించిన మందులు తక్కువ ధరకే లభించనున్నాయి. వివిధ ఔషధాల ధరలు తగ్గాయని డీలర్లు, స్టాకిస్టులకు తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఎన్‌పిపిఎ ఆదేశించింది. ఫార్మాస్యూటికల్స్ అండ్  నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ధరలు తగ్గిన మందుల జాబితాలో యాంటాసిడ్‌లు, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ ఉన్నాయి.
 
మధుమేహ రోగులు.. 

భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు.యాంటాసిడ్లు అజీర్ణం నుంచి ఉపశమనాన్ని అందించడానికి పనిచేసే మందులు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీబయాటిక్స్ అనేవి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు. ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. మందుల ధరల తగ్గింపుతో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నారు.

గత నెలలో ఫార్మాస్యూటికల్స్ విభాగం 923 ఔషధ ఫార్ములేషన్లకు వార్షికంగా సవరించిన ధరలను 65 ఫార్ములేషన్లకు రిటైల్ ధరలను సవరించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.