గుజరాత్‌లో పెరుగుతున్న చాందీపురా వైరస్ కేసులు.. 32 మంది మృతి..
సాక్షి లైఫ్ : గుజరాత్‌లోని చాందీపురా వైరస్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దీంతో అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు గుజరాత్ రాష్ట్రంలో 84 కేసులు నమోదవ్వగా, ఈ వ్యాధి కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కూడా అక్కడి ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. చాందీపురా వైరస్ లక్షణాలు ఫ్లూ లక్షణాలు లానే ఉంటాయి. ఈ వైరస్ 15 ఏళ్లలోపు పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది.
ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
ఇది కూడా చదవండి..నిఫా వ్యాప్తిని నిరోధించేందుకు రంగంలోకి కేంద్రం ప్రత్యేక బృందాలు..
చిన్నారులపై తీవ్ర ప్రభావం..
చాందీపురా వైరస్ లక్షణాలు ఫ్లూ లా ఉన్నపటికీ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత మెదడు వాపు వస్తుంది..ఎక్కువగా ఈ వ్యాధి చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆదివారం గుజరాత్‌లో 13 కొత్త చాందీపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. చాందీపురా వైరస్ లక్షణాలున్న రోగుల నమూనాలను పరీక్షల నిమిత్తం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
