పెరుగుతున్న చాందీపురా వైరస్ కేసులు..  

షేర్ చేయండి:
పెరుగుతున్న చాందీపురా వైరస్ కేసులు..  

సాక్షి లైఫ్ : గుజరాత్‌లో చాందీపురా వైరస్ ఎన్సెఫాలిటిస్ (సిహెచ్‌పివి) పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం నాటికి 37కి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ వివరాలు తెలిపింది. చాందీపురా వైరస్ కారణంగా 10 మంది చనిపోయినట్లు  ధృవీకరించారు గుజరాత్ ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ నీలం పటేల్. ఇప్పటివరకు నమోదైన మొత్తం 124 మంది రోగులలో 44 మంది పరిస్థితి విషమంగా ఉందని బులెటిన్ లో వెల్లడించారు ఆరోగ్య శాఖా అధికారులు. 

ఇది కూడా చదవండి..ఎలాంటి వారిలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి..? 

 

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?  

బుధవారం 13 నెలల బాలుడు అతిసారం, తీవ్రమైన జ్వరం,వాంతుల లక్షణాలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. భరూచ్‌లోని ఘనీఖుట్ గ్రామంలో మరొక చాందీపురా వైరస్ కేసు నమోదైంది. 

ప్రత్యేక సంరక్షణలో చికిత్స..

ఐతే మరొక బాలుడిని రాజ్‌పిప్లా సివిల్ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య బృందాల ప్రత్యేక సంరక్షణలో చికిత్స అందిస్తున్నారు. జూలై 23 న,ఘనీఖుట్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు కూడా అదే ఆసుపత్రిలో చేరాడు.ఆ తరువాత, బాలుడిని మెరుగైన చికిత్స కోసం వడోదరలోని గోత్రి వద్ద ఉన్న GMERS ఆసుపత్రికి తరలించారు. అతని రక్త నమూనా సేకరించిన వైద్యులు పరీక్ష ఫలితాల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) పూణేకు తరలించారు. ఏడాది వయసున్న బాలుడి రక్త నమూనాలను ఎన్‌ఐవీ పూణె, గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌కు పంపారు. ఈ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.   

ఇది కూడా చదవండి..30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.