ఆఫీస్ లో వర్క్ చేసే గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పని చేసే మహిళలకు ప్రెగ్నెన్సీ టైమ్ అనేది పెద్ద సవాలుగా ఉంటుంది. చాలా సార్లు పని , ఆరోగ్యం మధ్య సరైన సమన్వయం ఉండదు. ఎక్కువసేపు పనిచేస్తూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, అది తల్లి , బిడ్డ ఇద్దరికీ ప్రమాదం కావచ్చు. అటువంటి పరిస్థితిలో తల్లికాబోయే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..  

ప్రెగ్నెన్సీ అనుభవం ప్రతి స్త్రీకి భిన్నంగా ఉంటుంది. ఒకవేళ పని చేసే మహిళలు అయితే వీరు ఎదుర్కోవాల్సిన కొన్ని సవాళ్లు ఉంటాయి. వీటిని విస్మరించలేము ఎందుకంటే ఇవి తల్లితోపాటు పుట్టబోయే పిల్లలపై కూడా ప్రభావం చూపుతాయి. డెలివరీ తర్వాత ప్రసూతి సెలవలు ఉంటాయి.  కానీ డెలివరీకి ముందు అలాంటి సౌకర్యం లేకపోవడంతో కొంతమంది మహిళలు కొన్నిసార్లు 9వ నెల వరకు కూడా ఆఫీసులకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వారు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవేంటంటే..?

కుటుంబ సభ్యులకు.. 

-ఆఫీసుకు డ్రైవ్ చేసుకుంటూ వెళితే..  మొదటి, రెండవ త్రైమాసికంలో బాగానే ఉంటుంది. కానీ మూడవ త్రైమాసికంలో చాలా అసౌకర్యాలు ఉండవచ్చు. అలాగే ఒంటరిగా ప్రయాణం చేయడం సరికాదని, అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్‌ను నియమించుకోవడం లేదా డ్రాప్ చేసి ఆఫీస్‌కు తీసుకెళ్లే బాధ్యతను కుటుంబ సభ్యులకు అప్పగించడం మంచిది.

-పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఆఫీస్ కు వెళితే, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే రూట్లలో వెళ్లడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల మానసికంగా కొత్తసమస్యలు తలెత్తుతాయి. దీని ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. 

-ఇల్లు, ఆఫీస్ మధ్య దూరం ఎక్కువగా ఉంటే, టీ , కాఫీ తాగడం మానుకోండి. ఎందుకంటే మూత్రానికి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గంలో టాయిలెట్ కు వెళ్లడానికి వసతులు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

-ఆఫీసుకు వెళ్ళాక వాంతులు లేదా వికారం అనిపిస్తే, దీని కోసం అల్లం ,నిమ్మకాయను మీతో ఉంచుకోండి.

- ఎక్కువ సేపు కూర్చోవద్దు. గంటకు ఒకసారి లేచి నడుస్తూ ఉండాలి. ఇలా నడవడం వల్ల వెన్ను, నడుము నొప్పి తగ్గి, కాళ్ళలో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.

 ఇది కూడా చదవండి.. దంత సమస్యలు రాకుండా ఉండాలంటే..? 

 ఆరోగ్యకరమైన ఫుడ్..  

 -ఖాళీ కడుపుతో ఆఫీసుకు వెళ్లవద్దు, అది బలహీనతను కలిగిస్తుంది కడుపులో బిడ్డకు కూడా మంచిది కాదు. ఆరోగ్య కరమైన ఫుడ్ తీసుకోండి.  

-మూడవ త్రైమాసికంలో సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చోండి, ఇది పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ సేపు కాళ్లు వేలాడుతూ కూర్చోవద్దు. కాళ్లకు మద్దతుగా కుర్చీ కింద ఒక స్టూల్ ఉంచండి, తద్వారా కాళ్లలో వాపు సమస్య ఉండదు.

 ఇది కూడా చదవండి.. హెల్తీగా ఉండాలంటే..భోజనానికి, నిద్రకు లింక్ ఏంటి..?  

సమయానికి డాక్టర్ దగ్గరకు వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకోండి.  
ఆఫీసులో మీకు వాంతులు, కళ్లు తిరగడం లేదా కడుపునొప్పి వంటివి అనిపిస్తే, ఇతరుల సహాయం తీసుకోవడానికి సంకోచించకండి.

ఇది కూడా చదవండి.. మష్రూమ్స్ తో హెల్త్ బెనిఫిట్స్ ఇవే.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.