Dengue death toll in Bangladesh: బంగ్లాదేశ్‌లో డెంగీ మృత్యుఘోష..! ఒక్క రోజులోనే 8 మంది మృతి..
సాక్షి లైఫ్ : దక్షిణాసియా దేశం బంగ్లాదేశ్‌లో డెంగీ (Dengue) పంజా విసురుతోంది. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, గత 24 గంటల్లో 8 మంది మరణించినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది డెంగీ మృతుల సంఖ్య 364కు చేరింది. దేశంలో డెంగీ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఆందోళనకరంగా కొత్త కేసులు..
మరణాల సంఖ్య పెరగడంతో పాటు, ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 778 మంది కొత్త రోగులు చేరినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) తెలిపింది. దీంతో 2025 సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం డెంగీ కేసుల సంఖ్య 90,264కు పెరిగింది.
మైమెన్‌సింగ్‌లో ఎక్కువ మరణాలు..
తాజా మరణాలలో మైమెన్‌సింగ్ డివిజన్‌లో ముగ్గురు, ఢాకా సౌత్ సిటీ కార్పొరేషన్‌లో ఇద్దరు, బరిషల్, ఢాకా, చిట్టగాంగ్ డివిజన్లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్‌ను డెంగీ తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది (2024) మొత్తం 575 మంది, అంతకుముందు సంవత్సరం (2023) రికార్డు స్థాయిలో 1,705 మంది ఈ వ్యాధి బారినపడి మరణించారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
