ప్రముఖ నటి పూనమ్ పాండే మృతి.. కారణం ఇదే..  

షేర్ చేయండి:
ప్రముఖ నటి పూనమ్ పాండే మృతి.. కారణం ఇదే..   

సాక్షి లైఫ్ : ఆరోగ్యంపై సరైన శ్రద్ధ లేకపోవడంతో చాలామంది వయసుతో సంబంధంలేకుండా పలురకాల రోగాల బారీన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి ,మోడల్ పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తో చనిపోయింది. కాబట్టి క్యాన్సర్ గురించి ప్రజలందరూ అవగాహన పెంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 32ఏళ్లకే పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తో చనిపోవడంతో దేశంలోని ప్రజలంతా షాక్ కు గురవుతున్నారు. చనిపోయిన విషయాన్ని పూనమ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె మేనేజర్ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె కన్నుమూసినట్లు మేనేజర్ వెల్లడించారు. పూనమ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాదిమంది మరణిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లోనే ఎక్కువగా సంభవిస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.25 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం 75 వేల మంది చనిపోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ఆర్టికల్ లో పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయిందన్న వార్తలు వచ్చిన తర్వాత అందించిన సమాచారంగా మాత్రమే భావించండి. వార్త అందించిన తర్వాతరోజు నటి పూనమ్ పాండే తానూ మరణించలేదన్న విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే..!   

 

ఇది కూడా చదవండి.. స్మోకింగ్ కారణంగా గుండె జబ్బులు తొందరగా వస్తాయా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.   

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.