టెలి మనస్ కు అనూహ్య స్పందన 1 మిలియన్ దాటిన కాల్స్..  

సాక్షి లైఫ్ : ప్రజలమానసిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ ట్రోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇది అక్టోబరు 2022లో ప్రారంభమైంది. అప్పటి నుంచి టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ (టెలి-మనస్) హెల్ప్‌లైన్‌లో పది లక్షలకుపైగా కాల్స్ వచ్చాయని కేంద్రఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి.. యునాని ఔషధాలు ఎలా పనిచేస్తాయి..?  

"భారతదేశంలోమానసిక రుగ్మతలకు సరైన పరిష్కారాలు అందించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ 2002సంవత్సరం అక్టోబర్ లో ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని చెప్పట్టింది. అదే నేషనల్ టెలీ-మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. టెలి-మనస్  పేరుతో టోల్-ఫ్రీ నంబర్‌ ను ఏర్పాటుచేశారు. ఈ నెంబర్ కు ఇప్పటివరకు పదిలక్షలమందికి పైగా బాధితులు కాల్ చేశారు. సగటున రోజుకు 3,500 కాల్స్ వస్తున్నాయి" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలు.. 


ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలు అందించడంతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నారు. కాలర్లు, మానసిక ఆరోగ్య నిపుణుల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడం లక్ష్యంగా వారికి అర్ధమయ్యే భాషలోనే మాట్లాడతారు.

"ఇప్పటికే ఉన్న మానసిక ఆరోగ్య వనరులను అనుసంధానం చేయడం ద్వారా సమగ్ర డిజిటల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, దేశంలో మానసిక ఆరోగ్య అవసరాలను తీర్చడానికి టెలి-మనస్ ఒక ముఖ్యమైన వేదికగా టెలి-మనస్ మారింది" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో 51 టెలి-మనస్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, మానసిక ఆరోగ్య సేవలను పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 

దేశంలో కాలర్స్ సంఖ్య డిసెంబర్ 2022లో దాదాపు 12,000 నుంచి మే 2024 నాటికి 90,000కి పెరిగిందని, అవగాహన, యాక్సెసిబిలిటీని ప్రోత్సహించడం ద్వారా, దేశంలో ప్రజలు  ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి టెలి-మనస్ మరింత దోహదపడుతుంది" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి.. నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎన్నిరకాలు..?   

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression mental-tensions stress mental-problems good-response tele-manas
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com