Metabolic Diseases : మెటబాలిక్ డిసీజెస్ ఆసియాలోనే ఎక్కువ.. అగ్రస్థానంలో భారత్, చైనా..
సాక్షి లైఫ్ : ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జీవక్రియ సంబంధిత (మెటబాలిక్) వ్యాధుల భారంలో భారత్, చైనాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయని తాజా అధ్యయనం వెల్లడించింది. 1990 నుంచి 2023 వరకు జరిగిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) గణాంకాలను విశ్లేషించిన ఈ నివేదిక, 'మెటబాలిజం' అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
పెరిగిన వ్యాధి భారం (DALYs)..
శరీరంలో ఆహారం శక్తిగా మారే ప్రక్రియలో అంతరాయం కలగడం వల్ల ఈ మెటబాలిక్ వ్యాధులు వస్తాయి. టైప్-2 డయాబెటిస్.. 2023లో భారత్‌లో సుమారు 2.1 కోట్ల వైకల్య సర్దుబాటు జీవిత కాలాలు (DALYs) నమోదవగా, 5.8 లక్షల మరణాలు సంభవించాయి.
రక్తపోటు.. అధిక సిస్టోలిక్ బీపీ వల్ల దాదాపు 3.8 కోట్ల DALYs, 15.7 లక్షల మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1990లో చైనా అగ్రస్థానంలో ఉండగా, 2023 నాటికి భారత్ ఆసియాలోనే అత్యధిక వ్యాధి భారంతో మొదటి స్థానానికి చేరుకుంది.
ప్రధాన ముప్పు..
డయాబెటిస్‌తో పాటు అధిక శరీర బరువు (BMI), పెరిగిన ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, మెటబాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MASLD) వంటి సమస్యలు కూడా వేగంగా పెరుగుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారంపై నియంత్రణ, చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. ఆహార ప్యాకెట్లపై స్పష్టమైన పోషక విలువలను ముద్రించాలి. నడిచేందుకు సురక్షితమైన దారులు, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసి పాఠశాలలు, కార్యాలయాల్లో వ్యాయామం అలవాటు చేసేలా నగరాల రూపకల్పన జరగాలి.
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
