130కి పెరిగిన గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) కేసులు..
సాక్షి లైఫ్ : పూణేతోపాటు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో అరుదైన నాడీ రుగ్మత అయిన గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) అనుమానిత కేసుల సంఖ్య 130కి పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.మహారాష్ట్రలో ఇప్పటివరకు అనుమానిత జిబిఎస్ కారణంగా ఇద్దరు రోగులు, పూణేకు చెందిన 56 ఏళ్ల మహిళ, సోలాపూర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మరణించారు.
ఇది కూడా చదవండి..రోజూ ధనియాల నీళ్లు తాగడం వల్ల కలిగే ఏడు ప్రయోజనాలివే..
ఇది కూడా చదవండి..థైరాయిడ్ రుగ్మతలు బరువు పెరగడానికి లేదా తగ్గడానికి దారితీస్తాయా..?
ఇది కూడా చదవండి..నవజాత శిశువు ఆరోగ్యకరమైన బరువు ఎంత..?
అంతంతకుముందు రోజు మూడు కొత్త అనుమానిత ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని అధికారులు గురువారం తెలిపారు."మొత్తం 130 మందికి జిబీస్ ఉన్నట్లు అనుమానిస్తుండగా, వీరిలో 73 మందికి జిబిఎస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి సోకడం వల్ల ఇద్దరు చనిపోయినట్లు సమాచారం.
ఇరవై ఐదు మంది బాధితులు పూణే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల వారు కాగా, 74 మంది పిఎంసి పరిధిలో గ్రామాల వారు, 13 మంది పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల వారు ఉన్నారు, తొమ్మిది మంది పూణే గ్రామీణ ప్రాంతాల వారు, తొమ్మిది మంది ఇతర జిల్లాల వారికి వచ్చింది" అని వైద్యఅధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
