10 రాష్ట్రాలకు వ్యాపించిన JN.1 సబ్-వేరియంట్.. దేశంలో ఎన్ని..?   

షేర్ చేయండి:
  10 రాష్ట్రాలకు వ్యాపించిన JN.1 సబ్-వేరియంట్.. దేశంలో ఎన్ని..?   

సాక్షి లైఫ్ : JN.1 సబ్-వేరియంట్: JN.1 సబ్-వేరియంట్ కరోనా 10 రాష్ట్రాల్లో వ్యాపించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 196 కొత్త కేసులు నమోదయ్యాయి.కోవిడ్-19 సబ్ వేరియంట్ JN.1 కొత్త కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 196కు చేరింది. ఈ వేరియంట్ ఉనికిని గుర్తించిన రాష్ట్రాల జాబితాలో ఒడిశా చేరింది. ఇప్పటివరకు, 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైరస్ JN.1 సబ్ వేరియంట్ ఉనికిని గుర్తించాయి. సోమవారం (జనవరి 1, 2024) ఇండియన్ SARS CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) విడుదల చేసిన డేటాలో ఈ సమాచారం అందించారు.

 INSACOG ప్రకారం.. కేరళలో83, గోవాలో51, గుజరాత్ లో 34, కర్ణాటకలో  ఎనిమిది, మహారాష్ట్రలో ఏడు, రాజస్థాన్ లో ఐదు, తమిళనాడులో నాలుగు, తెలంగాణరాష్ట్రంలో రెండు, ఒడిశాలో ఒకటి, ఢిల్లీలో ఒకటి నమోదయ్యాయి.

డిసెంబర్‌లో దేశంలో నమోదైన 179 కోవిడ్ కేసుల్లో JN.1 ఉన్నట్లు INSACOG డేటాలో వెల్లడైంది. అయితే నవంబర్‌లో 17 కేసులను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) JN.1 వ్యాప్తి కారణంగా ప్రాణాలకు పెద్దగా ముప్పు ఉండదనిపేర్కొంది.

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడంతోపాటు JN.1 సబ్-వేరియంట్‌ను గుర్తించిన నేపథ్యంలో నిరంతరం నిఘా ఉంచాలని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది కేంద్రం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో 636 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే యాక్టివ్ కేసులు 4,394 గా ఉన్నాయి.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.