World Heart Day 2026 : బ్లూ లైట్ తోనే యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పు..!
సాక్షి లైఫ్ : ప్రజల్లో గుండె సంబంధిత సమస్యల పై అవగాహన కలిగించేందుకు సెప్టెంబర్ 29వతేదీన 'ప్రపంచ హృదయ దినోత్సవం' (World Heart Day 2026) నిర్వహిస్తారు. ఈసారి వరల్డ్ హార్ట్ డే థీమ్ "Don't miss a beat" తో సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గుండె జబ్బుల లక్షణాలను ముందే గుర్తించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా నేడు గుండె ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి సమయాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ (blue light) గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
యువతలోనే ఎక్కువ ముప్పు ఎందుకంటే..?
గతంలో వృద్ధులలో ఎక్కువగా కనిపించే గుండె జబ్బులు, ప్రస్తుతం 30 నుండి 40 సంవత్సరాల వయసున్న యువతను కూడా కబలిస్తున్నాయి. నిద్రలేమి సమస్యల కారణంగా అనేక మంది చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
ఆరోగ్యంపై స్క్రీన్ టైమ్ ప్రభావం..
మెలటోనిన్ హార్మోన్ తగ్గుదల: రాత్రి సమయంలో ఎక్కువ సేపు స్క్రీన్లను చూడటం వల్ల శరీరంలో నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. బయోలాజికల్ క్లాక్ అస్తవ్యస్తం: దీనివల్ల శరీర సహజ గడియారం (biological clock) దెబ్బతింటుంది. నిద్రలేమి కారణంగా గుండె కొట్టుకునే వేగంలో తేడాలు రావడం, రక్తపోటు (blood pressure) పెరగడం, ఫలితంగా చిన్న వయసులోనే గుండెపోటు (heart attacks) ముప్పు విపరీతంగా పెరుగుతోంది.
గుండెను కాపాడుకోవడానికి సూచనలు..
రాత్రి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే మొబైల్, లాప్టాప్ వంటి స్క్రీన్లకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ రాత్రి పూట ప్రశాంతంగా 7 నుంచి 8 గంటల పాటు గాఢమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
