ఇవాళ దేశంలో కోవిడ్ కేసులు..? 

షేర్ చేయండి:
ఇవాళ దేశంలో కోవిడ్ కేసులు..? 

సాక్షి లైఫ్ : భారతదేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. గత 24గంటల్లో 159 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,623 కు చేరుకుంది. కేరళ మంత్రిత్వ శాఖ ఉదయం 8 గంటలకు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఒకరు చనిపోయారు.

డిసెంబర్‌ నుంచి..  

భారతదేశంలో రోజువారీ COVID-19 కేసుల సంఖ్య డిసెంబర్ 5 వరకు తగ్గింది. అయితే న్యూ వేరియంట్స్ తోపాటు, చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగడం ప్రారంభమైంది. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకు 841 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది అత్యధికం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 92 శాతం మంది హోమ్ క్వారంటైన్‌ ద్వారానే కోలుకుంటున్నారు.

JN.1 వేరియంట్ తో ప్రమాదం లేదు.. 

JN.1 వేరియంట్ కారణంగా ప్రాణాపాయం లేదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఐతే భారతదేశంలో COVID-19 మూడు వేవ్ లు వచ్చాయి. 2021 ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో రోజువారీ కొత్త కేసులు పెరగడమే కాకుండా, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదైంది.

ఇప్పటి వరకు 5లక్షల 30వేలమందికిపైగా కరోనా కారణంగా మరణించారు. మే 7, 2021న, 4,14,188 కేసులు నమోదవ్వగా, 3,915మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది భారతదేశ చరిత్రలో రోజువారీ కేసులలో అత్యధిక గరిష్ట స్థాయి.

మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి.. 

 2020 ప్రారంభంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, 4కోట్ల 5లక్షలమందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. 5కోట్ల 30లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4కోట్ల 40లక్షలకు పైగా ఉండగా, నేషనల్ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి.. ఉల్లిపాయ పొట్టుతో ఉపయోగాలెన్నో.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.