ఎం.సీ.హెచ్, క్రిటికల్ కేర్ యూనిట్లను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ

షేర్ చేయండి:
ఎం.సీ.హెచ్, క్రిటికల్ కేర్ యూనిట్లను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ

సాక్షి లైఫ్ : నిజామాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఎం.సీ.హెచ్, క్రిటికల్ కేర్ యూనిట్లను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రెంజల్ మండల కేంద్రంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని కూడా ప్రారంభించారు.

అధికారులతో సమీక్ష నిర్వహించిన దామోదర రాజనర్సింహ నిజామాబాద్ జిల్లా వైద్య సేవల పనితీరు, వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల అవసరాలు వంటి అంశాలపై చర్చించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపర్చాలని, ప్రైవేట్ క్లినిక్ లు నిర్వహించడం వలన ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోకుండా, ప్రభుత్వ వైద్యం పట్ల భరోసా పెంపొందించడానికి వైద్యులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

ఇది కూడా చదవండి.. శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? 

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

 ఉగాది నాటికి వైద్య సేవల పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర రాజనర్సింహ. ఇంకా, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు అన్ని స్థాయిల్లో అవసరమైన సదుపాయాలు త్వరలో అందుబాటులో ఉంచతామని ఆయన వెల్లడించారు. 

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.