కర్ణాటకలో 'మంకీ ఫీవర్ ' కేసులు
సాక్షి లైఫ్ : కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో మంకీ ఫీవర్ కేసులు నమోదవు తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి వైద్యాధికారులు, ఇతర సిబ్బంది అప్రమత్త మయ్యారు. కేసులు పెరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంకీ ఫీవర్ బారిన పడ్డారు. జనవరి 8న శివమొగ్గ జిల్లాలోని హోసానగర్ తాలూకాలో మొదటగా మంకీ ఫీవర్ కేసు నమోదైంది.
18 ఏళ్ల యువతి ఈ వైరస్ బారిన పడిచనిపోయింది. చిక్కమగళూరులోని శృంగేరి తాలూకాకు చెందిన 79 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉడిపి జిల్లాలోని మణిపాల్‌లో మరణించాడు. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 49 కేసులు నమోదయ్యాయని సీనియర్ ఆరోగ్య అధికారి తెలిపారు.
ఉత్తర కన్నడ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవగా, ఆ తర్వాతి స్థానాల్లో శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాలు ఉన్నాయి. మంకీ ఫీవర్ ను క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ లేదా కెఎప్ డీ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకి ఇప్పటికే ఇద్దరు మృతి చెందడంతో కర్ణాటకలో భయాందోళన మొదలైంది.
2,288 నమూనాలను పరీక్షించగా 49మందికి మంకీ ఫీవర్ సోకిందని తేలింది. ఈ మంకీ ఫీవర్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్‌దీప్ వెల్లడించారు. నాలుగేళ్ళ క్రితం కూడా కర్ణాటక రాష్ట్రంలో కొన్ని మంకీ ఫీవర్ కేసులు వచ్చాయి. ఆసమయంలో ఈ వ్యాధి కారణంగా 26మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి.. పరిశోధన : బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో ఎండు ఖర్జూరం పాత్రకీలకం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
