ఢిల్లీలో మంకీ పాక్స్‌ నిర్ధారణ..

షేర్ చేయండి:
ఢిల్లీలో మంకీ పాక్స్‌ నిర్ధారణ..

సాక్షి లైఫ్ : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ (ఎంపాక్స్) కేసు వెలుగు చూసింది. ఢిల్లీలో ఒక్కరికి ఈ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీకి చెందిన ఒకరికి మంకీ పాక్స్‌ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వ్యక్తి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, జనాల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 అధికారులు చర్యలు.. 

ఎం పాక్స్ కేసులను కనుగొనడంతో కేంద్ర సర్కారు అప్రమత్తమైంది. ఈ వ్యాధికి సంబంధించి, అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు. రోగుల నుంచి నమూనాలను సేకరించి, మంకీ పాక్స్ నిర్ధారణ కోసం ల్యాబ్‌లకు పంపించారు. వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించడానికి, వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేక బృందాలను నియమించారు.

కాంటాక్ట్ ట్రేసింగ్.. 

నిబంధనలకు అనుగుణంగా, సంబంధిత వ్యక్తులతో మంకీ పాక్స్‌ కేసులకు సంబంధించిన కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోంది. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (సిడిసి) ఈ వ్యాధి తీవ్రతను అంచనా వేసింది. ప్రజలందర్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది.

అంతర్జాతీయ విమానాశ్రయాలు.. 

భారత్ లోని అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఎం పాక్స్ ఉన్న దేశాలనుంచి వచ్చేవారిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వ్యాప్తిస్తున్నది. వివిధ దేశాల్లో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. దీంతో, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఈ వ్యాధి నియంత్రణకు ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఎలాంటి లక్షణాలు కనిపించినా వారు తక్షణం వైద్య సలహా తీసుకోవాలని,ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని అధికారులు సూచించారు.  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.