కేరళలో ఎంపాక్స్ కేసు నిర్ధారణ..
సాక్షి లైఫ్ : కేరళలో ఎంపాక్స్ వ్యాధి నిర్ధారణ అయింది. మలప్పురంలో చికిత్స పొందుతున్న వ్యక్తికి మంకీ పాక్స్ వ్యాధి సోకిందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. యుఎఇ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఎం పాక్స్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఫలితాల్లో ఎంపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఇది కూడా చదవండి..యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..అల్పాహారం విషయంలో ఈ నాలుగు ఆహారాలు తినవద్దు : నిపుణులు హెచ్చరిక
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే ఏమిటి..? వాటిని ఎలా పొందాలి..?
కొందరిలో వేరే లక్షణాలు..
మంకీపాక్స్ అనేది ఒక అరుదైన వైరల్ డిసీజ్. ఇది చికెన్ పాక్స్ లక్షణాలను పోలి ఉంటుంది. చర్మంపై పుండ్లు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. కొందరిలో వేరే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇది కొందరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్రస్తుతం మంకీపాక్స్ నివారించేందుకు టీకాలు అందుబాటులో ఉన్నాయి.
అప్రమత్తమైంన కేరళ..
కేరళలో ఎంపాక్స్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆరోగ్య శాఖ నియమించిన ఆసుపత్రులలో చికిత్స ,ఐసోలేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు పలు వైద్య కళాశాలల్లో చికిత్స సౌకర్యాలు కల్పించారు.
ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
