Healthy Habits : ఈ హెల్తీ హ్యాబిట్స్ తో సంపూర్ణ ఆరోగ్యం..!
సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సర్వసాధారణంగా మారింది. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్ ప్లాన్లు ఫాలో అవ్వాల్సిన పనిలేదు, రోజూ జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన రోజువారీ జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.. రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆ ఆరోగ్యకరమైన అలవాట్లు ఏమిటో చూద్దాం..
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
పోషకాలతో కూడిన అల్పాహారం..
ఉదయం చేసే అల్పాహారం (breakfast) రోజంతా మనకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల జీవక్రియ (metabolism) మెరుగుపడి, కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది.
రోజూ తగినన్ని నీళ్లు తాగాలి..
శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఇది జీర్ణక్రియను సులభతరం చేయడంతో పాటు, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.
అరగంట వ్యాయామం తప్పనిసరి..
రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా, సైక్లింగ్ లేదా ఏదైనా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. బరువు అదుపులో ఉండటమే కాకుండా, గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
మానసిక ప్రశాంతతకు ధ్యానం..
శారీరక ఆరోగ్యంతో పాటే మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. రోజూ కాసేపు ధ్యానం (Meditation) లేదా లోతైన శ్వాస తీసుకునే వ్యాయామాలు (breathing exercises) చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
కంటినిండా నిద్ర..
శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి కనీసం 7 నుంచి 8 గంటల నిరంతర, ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మరుసటి రోజు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.
జంక్ ఫుడ్‌కు దూరం.. సమతుల్య ఆహారానికి దగ్గరగా ఉండాలి..
నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. వాటి స్థానంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమతుల్య ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, జీవనశైలి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు..
మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నామనిపించినా, కాలానుగుణంగా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల ఏవైనా అనారోగ్య సమస్యలు రాబోతున్నా ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన చికిత్స తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
