Digestion : వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ ఎందుకు బలహీనపడుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వానాకాలం రాగానే వాతావరణం చల్లబడి ఎండల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ, ఆరోగ్యపరంగా మాత్రం అనేక సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు చాలా సాధారణం. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఫుడ్ పాయిజనింగ్ వంటివి తరచుగా వేధిస్తుంటాయి. కేవలం మందుల మీద ఆధారపడకుండా మన రోజువారీ జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

వానాకాలంలో బ్యాక్టీరియా, ఫంగస్..

వానాకాలంలో వాతావరణంలో తేమ శాతం అమాంతం పెరుగుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. దీనికి తోడు ఈ వాతావరణంలో మన జీర్ణక్రియ సహజంగానే కాస్త నెమ్మదిస్తుంది. కలుషితమైన నీరు, బయటి తిండ్లు తినడం, సరిగ్గా ఉడకని ఆహారం తీసుకోవడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు అవసరం.

జీర్ణవ్యవస్థను పటిష్టం చేసే 7 మార్గాలు..

తేలికపాటి, తాజా ఆహారం: ఎప్పటికప్పుడు వేడిగా, తాజాగా వండిన ఇంట్లో భోజనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నూనెలో వేయించిన, మసాలాలు ఎక్కువగా ఉండే, నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి అరగడానికి సమయం పట్టి జీర్ణవ్యవస్థపై అదనపు భారం మోపుతాయి.

తగినన్ని నీళ్లు తాగాలి.. వర్షాకాలంలో దాహం తక్కువగా వేసినప్పటికీ, శరీరానికి అవసరమైన నీటిని కచ్చితంగా అందించాలి. కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని తాగడం వల్ల నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల (Waterborne diseases) బారిన పడకుండా ఉండొచ్చు.

అల్లం, జీలకర్ర వాడకం.. అల్లం, జీలకర్ర, సోంపు వంటివి మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని రోజూ వంటల్లో వాడటం లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకుని హెర్బల్ టీ రూపంలో తీసుకోవడం మంచిది.

ప్రోబయోటిక్స్ తప్పనిసరి..పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను (Gut health) వృద్ధి చేసి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.

పండ్లు, కూరగాయల శుభ్రత.. ఈ సీజన్‌లో పండ్లు, పచ్చి కూరగాయలపై బ్యాక్టీరియా, మురికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని వండే ముందు లేదా తినే ముందు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి.

సమయానికి భోజనం..ఎక్కువ గంటలు కడుపు మాడ్చడం లేదా అర్ధరాత్రి వేళల్లో భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. రోజూ ఒకే సమయానికి, సమతుల్యమైన ఆహారం తీసుకునే అలవాటు చేసుకోవాలి.

తేలికపాటి వ్యాయామం..రోజూ భోజనం చేసిన వెంటనే కాకుండా కాస్త సమయం తీసుకుని కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నడక లేదా తేలికపాటి యోగా చేయాలి. దీనివల్ల జీర్ణక్రియ రేటు పెరిగి, పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం..! 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.