అల్పాహారం విషయంలో ఈ నాలుగు ఆహారాలు తినవద్దు : నిపుణులు హెచ్చరిక
సాక్షి లైఫ్ : ప్రతిరోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలామందికి అలవాటు. అందులో భాగంగా పలురకాల అల్పాహారాలు తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో ఏమేం తీసుకోవాలి..? ఏమేం తీసుకోకూడదు అనేదానిపై పోషకాహార నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. రోజంతా రిఫ్రెష్‌మెంట్ బ్రేక్‌ఫాస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ రకమైన అల్పాహారాన్ని బ్రెయిన్ ఫుడ్ అంటారు. ఇప్పుడు, నిపుణులు అల్పాహారం నుంచి దూరంగా ఉండవలసిన నాలుగు ఆహారాల జాబితాను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఈ ఆహారాలను అల్పాహారంలో ఎందుకు చేర్చకూడదు? అంటే..? వీటిలో మనకు అవసరం లేని కేలరీలు ఉంటాయి. అంతేకాదు వీటిని తినడం వల్ల శరీరంలో చక్కెర అధికంగా పెరుగుతుంది. తద్వారా ఊబకాయ సమస్యకు దారితీస్తుంది.
ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలి..?
మొదటిది రసాలు,స్మూతీస్: ఎందుకంటే వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది త్వరగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల రోజంతా మరింత ఆకలిగా అనిపిస్తుంది.
రెండవది కాఫీ లేదా టీ: వీటిని మీరు భోజనంతో పాటు తీసుకుంటే, ఆహారంలోని ముఖ్యమైన పోషకాలైన ఐరన్, జింక్ , కాల్షియంను తగ్గిస్తుంది.
పెరుగు: ఇందులో చక్కెర ఎక్కువ, కాబట్టి దీన్ని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అల్పాహారంగా తినడం మీ ఆరోగ్యానికి చాలా హానికరం అని నిపుణులు చెబుతున్నారు.
తృణధాన్యాలు : అత్యంత ప్రజాదరణ పొందిన అధిక కేలరీల ఆహారం, వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కానీ ప్రోటీన్ ,ఫైబర్ లేనివి అయితే ఆకలిని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
