కేరళలో పెరుగుతున్న అమీబిక్ ఎన్సెఫాలిటిస్ కేసులు
సాక్షి లైఫ్ : కేరళలో అమీబిక్ ఎన్సెఫాలిటిస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కన్నూర్‌లో మూడున్నరేళ్ల బాలుడికి అమీబిక్ మెదడువాపు వ్యాధి సోకింది. పరియారానికి చెందిన ఓ చిన్నారి కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది.
ఇది కూడా చదవండి.. బ్రకోలీని ఇలా తింటే10 రెట్లు ప్రయోజనాలు పొందవచ్చు..
ఇది కూడా చదవండి.. మలబద్ధకం తలెత్తకుండా ఉండాలంటే..?
ముందుగా చిన్నారిని పరియారం మెడికల్ కాలేజీలో చేర్పించారు. అక్కడ వ్యాధి ఉన్నట్లు తేలింది. చిన్నారి నిన్న జలపాతంలో స్నానం చేసింది. జలపాతం నుంచి చిన్నారికి వ్యాధి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
అమీబిక్ ఎన్సెఫాలిటిస్ పెద్ద ఆందోళనగా మారుతున్నప్పటికీ, ఈ వ్యాధి గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. వ్యాధిని కలిగించే అమీబా నిలిచిన నీటిలో నివసిస్తుంది. అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అనేది అరుదైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. అమీబా స్నానం చేసేటప్పుడు ముక్కు సన్నని చర్మం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఇది అంటువ్యాధా..?
ఈ వ్యాధి మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది, కాబట్టి మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. మరొక సవాలు ఏమిటంటే..? వ్యాధికారక వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, లక్షణాలు కనిపించడానికి ఒక వారం వరకు పట్టవచ్చు. తలనొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
