మలబద్ధకం తలెత్తకుండా ఉండాలంటే..? 

షేర్ చేయండి:
మలబద్ధకం తలెత్తకుండా ఉండాలంటే..? 

సాక్షి లైఫ్ : జాక్ ఫ్రూట్‌(పనస పండు)లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవును.. విటమిన్ "సి", యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన జాక్ ఫ్రూట్‌ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..? 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ,అధిక ఫైబర్ కంటెంట్‌ కలిగి ఉన్న ఈ ఫ్రూట్  మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది.

ఇందులో 'పెక్టిన్' అనే ఒక రకమైన ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కేలరీలను పెంచకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు.

 పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జాక్ ఫ్రూట్ జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారించడంలో పనసపండు కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అన్నిరకాల పోషకాలను పొందవచ్చు. 

మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ అన్నీ ఈ ఫ్రూట్‌లో ఉంటాయి. కాబట్టి ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మెగ్నీషియం పుష్కలంగా ఉన్న పనస పండు ఒత్తిడి ,ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ "ఏ", "సి"  ఉండడం వల్ల  చర్మ ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

 ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?  

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.